Prabhas : ఈ ఏడాది ప్రభాస్ డబుల్‌ ధమాకా సాధ్యమేనా?

NQ Staff - January 21, 2023 / 11:02 PM IST

Prabhas : ఈ ఏడాది ప్రభాస్ డబుల్‌ ధమాకా సాధ్యమేనా?

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి, ఇప్పటికే ఆయన హిందీ సినిమా ఆదిపురుష్ షూటింగ్ ముగించాడు. ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

గ్రాఫిక్స్ మూవీ అవడంతో దాదాపుగా ఏడాదిన్నర కాలంగా పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరుగుతుంది. ఈ ఏడాది కచ్చితంగా ఆదిపురుష్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్నట్లుగా చిత్ర సభ్యులు హామీ ఇచ్చారు.

గత ఏడాదిలో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ఈ ఏడాదిలో విడుదల కాకుంటే ఫ్యాన్స్ కచ్చితంగా చిత్ర యూనిట్ సభ్యులపై దుమ్మెత్తి పోసే అవకాశం ఉంది. అందుకే ఈ ఏడాదిలో కచ్చితంగా ఆదిపురుష్‌ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

మరో వైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా కూడా ఇదే సంవత్సరం రాబోతున్నట్లు హంబుల్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ వారు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విడుదల తేదీని కూడా అనౌన్స్ చేసినప్పటికీ ఆ మధ్య సలార్ సినిమా ఈ సంవత్సరం విడుదల అయ్యేది అనుమానమే అన్నట్లుగా కొందరు అభిప్రాయం చేశారు.

కానీ ప్రశాంత్ నీల్ కి ఉన్న ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఈ ఏడాది జూన్ లేదా జులై వరకు సలార్‌ యొక్క షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాడట. అదే కనుక నిజమైతే సెప్టెంబర్ లో సలార్ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం.

మొత్తానికి ఆదిపురుష్‌ మరియు సలార్ సినిమాలు ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రభాస్ డబుల్‌ ధమాకా అన్నట్లుగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నాడు. అన్ని కుదిరితే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కూడా ఇదే ఏడాదిలో చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది నిజమైతే ఇక ఫ్యాన్స్ కి పండగే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us