Prabhas: కరీనా కపూర్ ఫ్యామిలీకి బిర్యానీ పంపిన ప్రభాస్

Prabhas: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో ఉన్నవే.

Prabhas Sent Biryani to Kareena Kapoor Family
Prabhas Sent Biryani to Kareena Kapoor Family

అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఇండస్ట్రీలో పలువురు నటీనటులకు తమ ఫేవరెట్ ఫుడ్ ఐటెమ్స్ ని ఒకరికి పంపుకుంటూ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు.

ఈ విషయంలో ప్రభాస్ కాస్త ముందు వరుసలో ఉంటారు. తన కోస్టార్స్ కి టేస్టీ ఫుడ్ ఐటెమ్స్ ని పంపిస్తుంటారు. తనతో కలిసి పనిచేసిన పూజా హెగ్దే, శృతి హాసన్ లకు ఫుడ్ పంపి ఈ విషయంలో క్లారిటీ కూడా ఇచ్చారు.

ఇప్పుడు ప్రభాస్ లేటెస్ట్ గా బాలీవుడ్ సినీ నటి కరీనా కపూర్ కి బెస్ట్ టేస్టీ బిర్యానీని పంపి సర్ ప్రైజ్ చేశారు ప్రభాస్. బాహుబలి మీకు బెస్ట్ బిర్యాని పంపినప్పుడు కరీనాకు ఉత్తమమైందని.. ఈ అద్భుతమైన, రుచికరమైన భోజనానికి నేను ఫిదా అయ్యానని.. ప్రభాస్ కు ధన్యవాదాలు చెప్పేస్తూ.. ప్రభాస్ పంపిన బిర్యానీ స్నాప్ ను షేర్ చేస్తూ థ్యాంక్స్ చెప్పారు కరీనా కపూర్.

ప్రజంట్ ప్రభాస్, ఓం ప్రకాష్ రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో రావణ్ క్యారెక్టర్ లో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే.