Prabhas : ప్రభాస్ సలార్ కథ కాపీ … క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ ..?

Prabhas : ప్రభాస్ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా సలార్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామగుండం కోల్ మైన్స్ లో శరవేగంగా సాగుతోంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలె బ్యానర్ పై విజయ్ కిరంగదుర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఫస్ట్ షెడ్యూల్ 10 రోజుల పాటు సాగనుంది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీన్స్ ని కంప్లీట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ షెడ్యూల్ లో కీర్తి సురేష్ కూడా పాల్గొంటుందని సమాచారం.

prabhas-salaar-story-is-a-copy-clarity-given-by-prashanth-neel
prabhas-salaar-story-is-a-copy-clarity-given-by-prashanth-neel

ఇక కేజీఎఫ్ రెండు భాగాల తో ప్రశాంత్ నీల్ అంటే దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. పాన్ ఇండియన్ డైరెక్టర్ అన్న పాపులారిటీ వచ్చిన ప్రశాంత్ నీల్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో సలార్ తెరకెక్కిస్తుండటం తో అందరి చూపూ ఈ మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్ట్ మీదే ఉంది. అంతేకాదు ప్రశాంత్ నీల్ – ప్రభాస్ ఈ సినిమాని కేవలం 4 నెలల్లోనే కంప్లీట్ చేయాలని డిసైడయ్యారు. ఇదే విషయాన్ని వెల్లడించారు కూడా. దాంతో ఇప్పుడు అందరిలో కూడా సలార్ సినిమా గురించే చర్చలు సాగుతున్నాయి. ఎలాంటి కథ లో ప్రభాస్ ని చూపించబోతున్నాడన్న క్యూరియాసిటీ ప్రతీ ఒక్కరిలో పెరిగిపోయింది.

Prabhas : ఈ కథ ఏ సినిమా కథ కి కాపీ కాదని రూమర్స్ కి చెక్ పెట్టాడు.

ఈ క్రమంలోనే సలార్ కథ మీద పలు రకాల వార్తలు.. రూమర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సలార్ కథ గతంలో వచ్చిన ఉగ్రం సినిమా రీమేక్ అని చర్చించుకుంటున్నారు. అంతేకాదు హాలీవుడ్ నుంచి ఈ సినిమా కథ ని కాపీ కొట్టి ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియన్ స్థాయిలో మార్పులు చేర్పులు చేసి రూపొందిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఇవన్ని ప్రశాంత్ నీల్ కి తెలియడం తో క్లారిటీ ఇచ్చాడు. సలార్ పూర్తిగా కొత్త కథ అని ప్రభాస్ కోసమే తయారు చేసిన కథ అని వెల్లడించాడు. అంతేకాదు ఈ కథ ఏ సినిమా కథ కి కాపీ కాదని రూమర్స్ కి చెక్ పెట్టాడు.

Advertisement