కెజిఎఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ ” సాలార్ ” మూవీ. అదిరిపోయిన ఫస్ట్ లుక్

Admin - December 2, 2020 / 04:51 PM IST

కెజిఎఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ ” సాలార్ ” మూవీ. అదిరిపోయిన ఫస్ట్ లుక్

బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ప్రస్తుతం పలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తున్నారు. వీటిలో భాగంగా రాధే శ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే యువ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో ప్రముఖ నటి పూజ హెగ్డే ప్రభాస్ సరసన నటిస్తున్నారు. అలాగే యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం సెట్స్ పైన ఉంది. దీనితో వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనీ భావిస్తున్నారు.

prabas

ఇక పోతే ఆదిపురుష్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రన్నీ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా, వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి దీపికా పడుకునే నటిస్తుండగా, అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఇక ఇదిలా ఉంటె తాజాగా ప్రభాస్ నటిస్తున్న మరోక చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. అయితే కెజిఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘ సాలార్ ‘ చిత్రంలో నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఇక ఈ లుక్ చూస్తుంటే ప్రభాస్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. చేతిలో గన్ పట్టుకొని కాస్త కోపంగా చూస్తూ ప్రభాస్ కనిపిస్తున్నాడు. మొత్తానికి కెజిఎఫ్ స్థాయిలో ఈ సాలార్ చిత్రం ఉండనుందని ఈ లుక్ చూస్తుంటే స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిం బ్యానర్ పై దాదాపు 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక సాలార్ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కావడంతో ప్రభాస్ అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us