Prabhas : ప్రభాస్ సలార్ కోసం ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ కి ఇది పెద్ద షాకే మరి, అస్సలు ఊహించి ఉండరు..

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. ఒకటి.. రాధే శ్యామ్. రెండు.. సలార్. మూడు.. నాగ్ అశ్విన్ ఫిల్మ్. నాలుగు.. ఆదిపురుష్. అయితే వీటిలో ఒక మూవీ తప్ప మిగతా మూడింటిలో ఏది ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయంలో మాత్రం ఆయన ఫ్యాన్స్ అంచనాలు తప్పేట్లే ఉన్నాయి. ‘సలార్’ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది పెద్ద షాకే అని అంటున్నారు.

లాంఛైనా..

‘రాధే శ్యామ్’ షూటింగ్ పూర్తయిందని, ఔట్ పుట్ అద్భుతంగా ఉందని వార్తలు ఇప్పటికే వచ్చాయి. దీంతో హీరో ప్రభాస్ ‘రాధే శ్యామ్’ యూనిట్ కి స్పెషల్, కాస్ట్ లీ గిఫ్టులు ఇచ్చారనే అప్డేట్స్ కూడా వెలువడ్డాయి. కాబట్టి ఈ నాలుగు చిత్రాల్లో ఫస్ట్ ‘రాధే శ్యామే’ రిలీజ్ అవుతుందనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ‘రాధే శ్యామ్’ చిత్రీకరణకు ప్యాకప్ చెప్పేయటంతో ప్రభాస్ రీసెంటుగా ‘సలార్’ని అఫిషియల్ గా లాంఛ్ చేశారు. అయినా ఎందుకు వెనకబడిందో అనే చర్చకు తెర లేచింది.

పెండింగ్..Prabhas

‘సలార్’ ప్రాజెక్టుకి ప్రొ-ప్రొడక్షన్ పనులు పెండింగులో పడటంతో దీనికన్నాముందు నాగ్ అశ్విన్ ఫిల్మ్ని పట్టాలెక్కించాలని, ప్రభాస్ ఇక ఈ లొకేషన్ లోకే అడుగుపెట్టబోతున్నాడని లేటెస్టుగా తెలుస్తోంది. అది పూర్తయ్యాకే ‘సలార్’ స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. ఈ రెండింటినీ కంప్లీట్ చేశాకే ‘ఆదిపురుష్’ని ఆరంభిస్తారని ఇండస్ట్రీ వర్గాలు వివరిస్తున్నాయి.

Prabhas-salaar-movie-becoming-late
Prabhas-salaar-movie-becoming-late

అతి భారీ..

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందించనున్న ‘సలార్’ ఫిల్మ్ అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్టని, అందుకే అన్ని ఏర్పాట్లూ ముందే పక్కాగా ఫైనల్ చేయాలని ప్లాన్ చేస్తుండటం వల్లే షూటింగ్ లేటవుతోందని సమాచారం. ఇది అనూహ్యంగా చోటుచేసుకున్న పరిణామమని అంటున్నారు. ‘సలార్’లో భిన్న భాషా చిత్రాల యాక్టర్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టెక్నికల్ టీమ్ సెలెక్షన్ కూడా కంప్లీట్ కావొచ్చిందట. ప్రభాస్ మాఫియా డాన్ లా కనిపించే ఈ మూవీలో ప్రధాన విలన్ గా విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Advertisement