Prabhas: రోమాలు నిక్క‌పొడుచుకునేలా రాధే శ్యామ్ టీజ‌ర్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

Prabhas యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా వ‌రుస అప్‌డేట్స్ రాబోతున్నాయి. ముందుగా రాధేశ్యామ్ టీజ‌ర్ విడుద‌ల చేసి ఫ్యాన్స్‌కి అదిరిపోయే కానుక ఇచ్చారు. గత కొన్ని నెలల నుంచి రాధేశ్యామ్ అప్డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎట్ట‌కేల‌కు ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది.

TheNewsQube-

నువ్ ఎవరో నాకు తెలుసు.. కానీ ఏది చెప్పను.. ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు. కానీ నీకు అది చెప్పను.. నీ ఓటమి నాకు తెలుసు.. కానీ నేను చెప్పను.. నీ చావు నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను.. నాకు అన్నీ తెలుసు.. కానీ నేను ఏదీ చెప్పను.

ఎందుకంటే అది మీ ఊహలకు కూడా అందదు.. నా పేరు విక్రమ్ ఆదిత్య.. నేను దేవుడిని కాదు. కానీ నేను మీలో ఒకడిని కూడా కాదు అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. ఇందులో ప్ర‌భాస్ లుక్స్ కూడా అదిరిపోయాయి. టీజ‌ర్ పిచ్చెక్కిస్తుంది.


యూవీ క్రియేషన్స్, టీ సిరిస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగనుంది. ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే ఇందులో ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం జనవరి 14న రాబోతోంది. మొత్తానికి టీజ‌ర్ ద్వారా ఇన్ని రోజుల ఆకలిని ఈ రోజు తీర్చేశారు. ప్రభాస్ బర్త్ డే సందర్బంగా వదిలిన ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం స‌లార్,ఆదిపురుష్ చిత్రాల‌తో బిజీగా ఉండ‌గా ఈ రెండు చిత్రాల‌కు సంబంధించిన అప్‌డేట్స్ కూడా రానున్నాయి అని ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాల షూటింగ్ పూర్తైన త‌ర్వాత ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కె , నాగ్ అశ్విన్ చిత్రం, స్పిరిట్ చిత్రాలు చేయ‌నున్నాడు.