Prabhas : ఒక వైపు ‘ప్రాజెక్ట్‌ కే’ మరో వైపు ‘ఆదిపురుష్‌’

NQ Staff - May 19, 2023 / 10:44 PM IST

Prabhas : ఒక వైపు ‘ప్రాజెక్ట్‌ కే’ మరో వైపు ‘ఆదిపురుష్‌’

Prabhas : ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు. ఒకవైపు ఆయన నటించిన ఆదిపురుష్‌ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగించుకొని వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది.

జూన్ 16వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను అతి త్వరలోనే ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఆ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభాస్ టీం నిర్ణయించుకుంది.

అందుకోసం ప్లాన్ కూడా సిద్ధం చేసింది.. ఇక ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్ట్‌ కే సినిమా షూటింగ్ కార్యక్రమాలను కూడా ఇదే నెలలో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రాజెక్ట్‌ కే కి ఇది చివరి షెడ్యూల్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఒకవైపు ప్రాజెక్ట్‌ కే సినిమా షూటింగ్ కార్యక్రమంలో పాల్గొంటూ మరో వైపు ఆదిపురుష్‌ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రభాస్ పాల్గొనబోతున్నాడు.

రెండు సినిమాలకు ఒకేసారి డేట్లు కేటాయించడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్‌ సినిమా భారీగా విడుదల కాబోతుంది. కనుక పూర్తిగా ప్రమోషన్ కార్యక్రమాలకు కోసం డేట్స్ ఇస్తే బాగుండేది కదా అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ కే సినిమా చివరి దశ షూటింగ్ని ఆదిపురుష్‌ సినిమా విడుదలైన తర్వాత మొదలు పెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us