Prabhas : ప్రభాస్.. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ కలిసి 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే నటోస్తోంది. సమ్మర్ కి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా తరువాత కేజీఎఫ్ తో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సాధించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేయబోతున్నాడు. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి రానుంది.

ఇక ఇప్పటికే బాలీవుడ్లో ఓం రవుత్ దర్శకత్వం వహిస్తున్న మైథలాజికల్ సినిమా ఆదిపురుష్ ప్రారంభం అయింది. ఈ సినిమాల తరువాత తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్ ఫిక్షన్ సినిమా చేయనున్నాడు. ఇలా నాలుగు పాన్ ఇండియన్ సినిమాలతో వచ్చే రెండేళ్ళ వరకు డార్లింగ్ ప్రభాస్ ఖాళీ లేడు. ఈ సినిమాలన్నీ ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా..అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు… ప్రేక్షకులు. అయితే ఈ ఏడాది రాధేశ్యామ్.. సలార్ ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావిస్తున్నారు.
Prabhas : ఇక్కడ కూడా ప్రభాస్ టాప్.. మిగతా హీరోలందరూ ఆ తర్వాతే ..!
కాగా డార్లింగ్ ప్రభాస్ కి ప్రస్తుతం దేశ.. విదేశాల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా అసాధారణమైన క్రేజ్ ని సంపాధించుకున్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రభాస్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇందులో భాగంగా ప్రభాస్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండకపోయినప్పటికీ ఏకంగా 6 మిలియన్లకు పైగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు టాలీవుడ్ స్టార్ హీరోల్లో మహేష్ బాబుకు 6.4 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా, అల్లు అర్జున్ 10.2 మిలియన్ , విజయ్ దేవరకొండకు 10.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తరువాత ప్లేస్ లో మిగతా హీరోలున్నారు.