Prabhas: రాధే శ్యామ్‌కు అమేజింగ్ ఓటిటి ఆఫర్.. ప్ర‌భాస్ చూపు ఎటు?

Prabhas: ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాను ఓటిటిలో విడుదల చేయడం కంటే సంచలనం మరోటి ఉండదేమో..? ఎందుకంటే బాహుబలి, సాహో లాంటి పాన్ ఇండియన్ సినిమాల తర్వాత ఈయన రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రభాస్ సినిమాలు ఇప్పుడు 300 నుంచి 500 కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. బాహుబలి ఏకంగా 2000 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఆ తర్వాత వచ్చిన సాహో నెగిటివ్ టాక్ తెచ్చుకున్న కూడా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. బాలీవుడ్ లో 150 కోట్లు వసూలు చేసి జెండా పాతేశాడు ప్రభాస్.

ఇలాంటి సమయంలో ఈయన సినిమాల కోసం అభిమానులు దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లో వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ సినిమా గురించి అనూహ్యమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ మరో 10 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. పరిస్థితులన్నీ బాగుండుంటే జులై 30న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. కానీ ఈ వైరస్ కారణంగా ఒకవైపు లాక్ డౌన్.. మరోవైపు థియేటర్లో మూతపడడం ఒకేసారి జరుగుతున్నాయి.

ఈ క్రమంలో అనుకున్న సమయానికి విడుదల చేయడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. కానీ యు.వి.క్రియేషన్స్ మాత్రం రాధే శ్యామ్ సినిమాను అనుకున్న సమయానికి ఎలాగైనా విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మాతలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఒకటి రెండు కాదు ఏకంగా 400 కోట్ల ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. నెట్ ఫ్లిక్స్ కొన్ని రోజుల కింద 300 కోట్ల ఆఫర్ ఇచ్చినా కాదన్నారు నిర్మాతలు.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని 190 కోట్లతో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఒకే రోజు విడుదల కానున్న ఈ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటలీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాధాకృష్ణ కుమార్. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాల తర్వాత ప్రభాస్ పూర్తిగా లవర్ బాయ్ క్యారెక్టర్ లో నటిస్తున్న సినిమా ఇదే.