Prabhas : ప్రభాస్‌కు ఆ దరిద్రమైన అలవాటు ఉందా.. అందుకే ఇలా మారిపోయాడా..?
NQ Staff - February 28, 2023 / 03:37 PM IST

Prabhas : పాన్ ఇండియా అనే పదం వింటే అందరి కంటే ముందుగా గుర్తుకు వచ్చే హీరో ప్రభాస్. ఆయన రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ వైపు పరుగులు తీస్తోంది. అందుకే ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్ అయిపోయాడు. బాహుబలితో ఆయన ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఒక్క దెబ్బతో ఆయన ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు.
అయితే ప్రభాస్ హెల్త్ కు సంబంధించిన వార్తలు ఈ నడుమ వైరల్ అవుతున్నాయి. ఆయన టాలీవుడ్ లో ఉన్నన్ని రోజులు చాలా యంగ్ లుక్ లో కనిపించాడు. కానీ ఎప్పుడైతే బాలీవుడ్ కు వెళ్లిపోయాడో అప్పటి నుంచి ముదురుగా కనిపిస్తున్నాడు. ఆయన ముఖంలో చార్మింగ్ లుక్ మొత్తం పోయింది.
ఆ హీరోలు చెప్పింది విని..
ప్రభాస్ బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత తనకు పడని డైట్లు మెయింటేన్ చేస్తున్నాడంట. అదే ఆయన కొంప ముంచుతోంది. ప్రభాస్ ఎవరు ఏం చెప్పినా వింటాడు. ఈ క్రమంలోనే కొందరు బాలీవుడ్ హీరోలు చెప్పిన డైట్లు మెయింటేన్ చేసి తన హెల్త్ ను పాడు చేసుకుంటున్నాడని అందున్నారు ఆయన ఫ్యాన్స్.
ప్రభాస్ టాలీవుడ్ లో ఉన్నప్పుడు మంచి ఫుడ్ రోజుకు ఐదు సార్లు భోజనం చేసేవారు. కానీ బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత కడుపు మాడ్చుకుని లేనిపోని అలవాట్లు చేసుకున్నాడు. దాని కారణంగా ఆయన స్కిన్ పొడి బారిపోయిందని అంటున్నారు కొందరు హెల్త్ నిపుణులు. ఏదేమైనా ప్రభాస్ తప్పుడు పనులు చేస్తున్నాడని అంటున్నారు ఆయన ఫ్యాన్స్.