Unstoppable Season2 : మేడమ్ కృతి సనన్.! ప్రభాస్‌తో ‘అది’ చెప్పించేసిన బాలయ్య.!

NQ Staff - December 30, 2022 / 11:58 AM IST

Unstoppable Season2 : మేడమ్ కృతి సనన్.! ప్రభాస్‌తో ‘అది’ చెప్పించేసిన బాలయ్య.!

Unstoppable Season2 : ‘ఆహా’ ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా నిర్వహిస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ రెండో సీజన్ తాజా ఎపిసోడ్‌లో గెస్ట్‌గా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేశాడు.

ప్రభాస్‌కి అసలే చాలా చాలా మొహమాటం. ఎపిసోడ్ జరుగుతున్నంతసేపూ ప్రభాస్ ‘మెలికలు’ తిరుగుతూనే వున్నాడు. గర్ల్ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు నిన్ను.? అని బాలయ్య ప్రశ్నిస్తే, ‘వాళ్ళు కూడా డార్లింగ్ అనే అంటారు..’ అనేసి నాలిక్కరుచుకున్న ప్రభాస్, ‘అమ్మాయిల్లోనూ కొందరు ఫ్రెండ్స్ వున్నారు.. వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ కాదు.. జస్ట్ ఫ్రెండ్స్’ అంటూ కవరింగ్ ఇచ్చుకున్నాడు ప్రభాస్.

మేడమ్ కృతి సనన్.. వెరీ వెరీ స్పెషల్..

పెళ్ళి ప్రస్తావన బాలయ్య ఎన్నిసార్లు తీసుకొచ్చినా, ‘టైమ్ రావాలి..’ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు ప్రభాస్. కానీ, ఖచ్చితంగా పెళ్ళి చేసుకుంటాడట. ఆ ఒక్క క్లారిటీ అయితే ప్రభాస్ నుంచి వచ్చింది.

కృతి సనన్‌తో ఎఫైర్ సంగతేంటి.? అని ప్రశ్నిస్తే, అదంతా ఇంటర్నెట్ రాతల సారాంశమని తేల్చేశాడు ప్రభాస్. కృతిసనన్‌ని మేడమ్ అని పేర్కొన్నాడు. ‘మేడమ్ కూడా క్లారిటీ ఇచ్చేసింది కదా.? అవన్నీ గాసిప్స్ అని తేల్చేసింది కదా..’ అన్నాడు. ఆ మేడమ్ పేరు చెప్పు.. అని పదే పదే బాలయ్య ఒత్తడి చేయడంతో కృతి సనన్ అని చెప్పుకొచ్చాడు.

‘నేనూ వసు మేడమ్’ అనే అంటాను.. అంటూ తన భార్య వసుంధర పేరుని తీసుకొచ్చి, ప్రభాస్‌ని ఇరకాటంలో పడేశాడు బాలయ్య.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us