Prabhas Krishnam Raju : అందరికీ హిట్స్ ఇచ్చిన కృష్ణంరాజు కొడుకుకి మాత్రం ఇవ్వలేకపోయాడు?

NQ Staff - September 11, 2022 / 03:14 PM IST

Prabhas Krishnam  Raju : అందరికీ హిట్స్ ఇచ్చిన కృష్ణంరాజు కొడుకుకి మాత్రం ఇవ్వలేకపోయాడు?

Prabhas Krishnam Raju : ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ల తర్వాత టాలీవుడ్ లో అగ్రహీరోగా కొనసాగారు కృష్ణంరాజు. తన తర్వాత తన కుటుంబం నుంచి వారసుడిగా తన తమ్ముడి కుమారుడు ప్రభాస్ ను ప్రోత్సహించాడు. వెనకుండి నడిపించాడు. ప్రతీ సినిమాతో ఓ మెట్టు ఎక్కించాడు. ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ గా మలిచాడు. ప్రభాస్ ఇప్పుడు దేశంలోనే ఒక గొప్ప స్టార్ గా ఎదిగడానికి వెనుక బ్యాక్ బోన్ కృష్ణంరాజు మాత్రమే. అందుకే ఆయన మరణం ప్రభాస్ తట్టుకోలేక పోతున్నాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. కృష్ణంరాజు అంత్యక్రియలను దగ్గరుండి ప్రభాస్ నిర్వహిస్తున్నాడు. రేపు మహాప్రస్థానంలో కృష్ణంరాజుకు తలకొరివి పెట్టబోతున్నాడు.

గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో

Prabhas Krishnam Raju Every Movies Failed

Prabhas Krishnam Raju Every Movies Failed

ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణంరాజు ఈరోజు పరిస్థితి విషమించి పరమవదించారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. ఆయను మధుమేహం, కోవిడ్ తర్వాత సమస్యలు, న్యూమోనియా తీవ్ర కావడం.. ఉదయం గుండెపోటు రావడంతో చనిపోయినట్లు ఏఐజీ ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది.

కృష్ణంరాజుకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కృష్ణంరాజు పనిచేశారు. ఏపీ నుంచి ఎంపీగా గెలిచారు. రేపు ఉదయం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Prabhas Krishnam Raju Every Movies Failed

Prabhas Krishnam Raju Every Movies Failed

ప్రభాస్ ను ఎంతో పెద్ద స్టార్ ను చేసిన కృష్ణంరాజుకు తీరని కోరికలు ఉన్నాయి. ప్రభాస్ తోపాటు తన ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు చూడకుండానే ఆయన మరణించారు. ఇక ప్రభాస్ తో కృష్ణంరాజు నటించిన ప్రతీ సినిమా కూడా ఫ్లాప్ కావడం వారి కెరీర్ లో ఒక మాయని మచ్చలానే ఉంది. ఇటీవల ‘రాధేశ్యామ్’లోనూ ప్రభాస్ గురువుగా కృష్ణంరాజు నటించారు. ఆ సినిమా కూడా అంతగా ఆడలేదు.

1966లో ‘చిలకా గోరికం’ చిత్రంతో కృష్ణంరాజు సినీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రెబల్ స్టార్ గా ఒక్కో మెట్టు ఎక్కాడు. ఆయన వారసుడిగా ప్రభాస్ ను టాలీవుడ్ కు పరిచయం చేశారు. వీరిద్దరూ కలిసి ‘బిల్లా, రెబల్, రాధేశ్యామ్’ సినిమాలో కలిసి నటించారు. రెబల్ సినిమాలో ప్రభాస్ తో పోటీగా యాక్షన్ సీన్స్ లో కూడా కృష్ణంరాజు నటించారు.

రాధేశ్యామ్ లో కూడా జ్యోతిష్కుడిగా నటించారు కృష్ణంరాజు. ఈ ఇద్దరినీ కలిపి స్క్రీమ్ మీద చూసి ప్రేక్షకులు ఎంతగానో మురిసిపోయారు. ఈ ఇద్దరు రెబల్ స్టార్స్ కలిసి నటించిన ఏ సినిమా కూడా ఆడకపోవడమే ఒక బాధగా అభిమానులు అభివర్ణిస్తున్నారు. తండ్రీకొడుకుల కాంబినేషన్ తెరపై అలరించేకపోయింది. అయినా వీరిద్దరినీ కలిసి చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. కృష్ణంరాజు మృతితో ఆ సీన్లను వైరల్ చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us