prabhas : ప్రభాస్ రాధే శ్యామ్ లో నటించిన రెబల్ స్టార్ కృష్ణం రాజు ..!

ప్రభాస్ రాధే శ్యామ్ లో రెబల్ స్టార్ కృష్ణం రాజు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు కలిసి స్క్రీన్ మీద మరోసారి సందడి చేయబోతున్నట్టు తాజాగా వెల్లడించారు. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రాధే శ్యామ్ కృష్ణం రాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్ – యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి నిర్మాతలు కృష్ణం రాజు కూతురు ప్రశీద.. వంశీ.. ప్రమోద్. ఇక రాధే శ్యామ్ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతోంది.

prabhas : krishnam raju acted in prabhas radhe shyam
prabhas : krishnam raju acted in prabhas radhe shyam

కాగా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఓ కీలక పాత్రను పోషించిన విషయాన్ని తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా వెల్లడించారు. ఈ సినిమాలో కృష్ణంరాజు మహాజ్ఞాని అయిన పరమహంస పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు. ఇక ఈ పాత్ర పోషణ కోసం కృష్ణంరాజు గడ్డం కూడా పెంచినట్టు వెల్లడించారు. అంతేకాదు ఇటీవలే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయిందని కృష్ణంరాజు వెల్లడించారు. ప్రస్తుతం రాధే శ్యామ్ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. మరొక వైపు రాధే శ్యామ్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా జరుగుతోంది. ఇక రాధే శ్యామ్ లో వీఎఫెక్స్ కూడా భారీ స్థాయిలో ఉంటాయని అంటున్నారు. ఇక రాధే శ్యామ్ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్.. బీట్స్ ఆఫ్ భారీ స్థాయిలో అంచనాలు పెరిగేలా చేశాయి.

prabhas : ప్రభాస్ తో కలిసి మరో రెండు సినిమాలలో నటించబోతున్న కృష్ణంరాజు..!

ఇక ప్రభాస్ తన పెదనాన్న తో కలిసి బిల్లా.. రెబల్ సినిమాలలో నటించారు. ఆ తర్వాత చాలాసార్లు మళ్ళీ యంగ్ రెబల్ స్టార్ — సీనియర్ రెబల్ స్టార్ కలిసి నటించాలనుకున్నారు. అంతేకాదు డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఈ ఇద్దరిని కలిసి సిల్వర్ స్క్రీన్ కూడా చూడాలని అనుకుంటున్నారు. ఎట్టకేలకి మళ్ళీ ఇంతకాలానికి రాధే శ్యామ్ తో ఆ కోరిక నెరవేరబోతోంది. ఇక ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తున్న టాక్ ని బట్టి ప్రభాస్ నటిస్తున్న నాగ్ అశ్విన్ సినిమా తో పాటు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఆదిపురుష్ లో కూడా కృష్ణం రాజు నటించబోతున్నట్టు తెలుస్తోంది.

 

Advertisement