Prabhas : ‘సలార్’ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన ప్రభాస్.!

NQ Staff - September 23, 2022 / 04:07 PM IST

160315Prabhas : ‘సలార్’ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన ప్రభాస్.!

Prabhas : యూనివర్సల్ స్టార్‌గా పేరు పొందాడు హీరో ప్రబాస్. ఆ ఇమేజ్‌తోనే వరుసగా భారీ ప్రాజెక్టులు టేకప్ చేశాడు. ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చాడు. ఇటీవల ఇంకాస్త జోరు పెంచిన ప్రబాస్, ఏక కాలంలోనే ఏకంగా మూడు పెద్ద ప్రాజెక్టులు పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. అందులో ‘ఆదిపురుష్’ దాదాపు పూర్తి కావస్తుండగా, మరో బిగ్ ప్రాజెక్ట్ ‘సలార్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Prabhas Joined Salaar Shooting Prashanth Neel Directorial

Prabhas Joined Salaar Shooting Prashanth Neel Directorial

ఈ లోపే అనుకోని కుదుపు ప్రబాస్‌ని దిగ్ర్భాంతిలోకి నెట్టేసింది. అదే పెదనాన్న కృష్టంరాజు హఠాన్మరణం. ప్రబాస్ కమిట్మెంట్ అలాంటిది.. ఇటీవలే కృష్టంరాజు అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆ బాధ ప్రబాస్‌కి తీరని లోటుగా చెప్పొచ్చు. ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేదు ప్రబాస్. కానీ, ఈ బాధను పంటి కింద దిగమింగుకునే తాజాగా ప్రబాస్ ‘సలార్’ షూటింగ్‌కి హాజరయ్యాడు.

తన కారణంగా షూటింగ్‌కి ఇబ్బంది కలగకూడదనీ, నిర్మాతకు నష్టం వాటిల్లకూడదనే తీర్చలేని బాధని పంటి కింద బిగబట్టుకుని షూటింగ్‌కి అటెండ్ అయ్యాడు ప్రబాస్. కృష్ణంరాజుకి సంబంధించిన అంతిమ సంస్కారాల్ని ప్రబాస్ దగ్గరుంచి చూసుకున్న సంగతి తెలిసిందే. కుటుంబాన్ని ఓదార్చే బాధ్యత మొత్తం ప్రబాస్ తన భుజాలపైనే వేసుకున్నాడు.

అంతిమ సంస్కారాల తదుపరి మిగిలిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి, బుధవారం నుంచే షూటింగ్‌లో పాల్గొన్నాడు ప్రబాస్. ప్రబాస్ కమిట్మెంట్‌ అలాంటిది. ఓవైపు బాధ వున్నా మరోవైపు నిర్మాత కష్ట, నష్టాల్ని కూడా దృష్టిలో పెట్టుకున్నప్రబాస్ కమిట్మెంట్‌ని మెచ్చుకోకుండా వుండలేకపోతున్నారు అభిమాన గణం.