Prabhas : ప్రభాస్ సలార్ స్టోరీ ఇదేనా – KGF చూసినవాళ్ళకి ఈజీ గా అర్ధం అవుతుంది.
Vedha - January 29, 2021 / 10:37 AM IST

Prabhas : ప్రభాస్ ప్రస్తుతం వరసగా సినిమాలని కమిటవుతూ 2022 వరకు బిజీ షెడ్యూల్ ని ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పటి వరకు ప్రభాస్ కమిటయిన సినిమాలన్ని పాన్ ఇండియన్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలే కావడం గొప్ప విషయం. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో కన్నడ స్టార్ యశ్ హీరోగా వచ్చిన సినిమా కె.జి.ఎఫ్. ఈ సినిమా కన్నడలో తెరకెక్కినప్పటికీ రిలీజైన అన్ని భాషల్లోనూ సంచలన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కె.జి.ఎఫ్ చాప్టర్ 2 కూడా రెడీ అవుతోంది. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా సలార్ చేస్తున్న సంగతి తెలిసిందే.

prabhas-Is this Prabhas Salar Story – Easy to understand for those who have seen KGF.
అయితే చాలా కాలం తర్వాత ప్రభాస్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో నటిస్తున్నాడు. సలార్ సినిమాను ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునే దాని కంటే భారీ స్థాయిలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్నాడు. సినిమా టైటిల్ పోస్టర్ తో పాటుగా ప్రభాస్ సలార్ లుక్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో హింట్ ఇచ్చాడు. కె.జి.ఎఫ్ సినిమాను ప్రశాంత్ నీల్ బొగ్గు గనుల్లో తీశాడు. చాప్టర్ 2 కూడా అక్కడే షూట్ చేసినట్టు రీసెంట్ గా రిలీజైన టీజర్ తో అర్థమవుతోంది. ఇప్పుడు సలార్ కూడా బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.
Prabhas : ప్రభాస్ ని సలార్ లో చూపించే స్థాయి మాత్రం చరిత్రలో మిగిలిపోతుందని చెప్పాల్సిందే.
కోల్ మైన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో ఆరు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని సమాచారం. అంతేకాదు ఒక్కో యాక్షన్ సీన్ హాలీవుడ్ సినిమాలని మించి ఉంటాయని చెప్పుకుంటున్నారు. ఒక యాక్షన్ సీన్ మాత్రం దాదాపు 15 నుంచి 20 నిముషాలు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఇంత పెద్ద యాక్షన్స్ ఎపిసోడ్ అంటే సలార్ ఏ రేంజ్ లో రూపొందబోతుందో ప్రభాస్ ని దర్శకుడు ప్రశాంత్ ని ఎలా చూపించబోతున్నాడో ఊహించడానికి కూడా అంతు పట్టడం లేదని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట. యష్ నే కె.జి.ఎఫ్ లో హై ఓల్టేజ్ లో చూపించాడంటే ప్రభాస్ ని సలార్ లో చూపించే స్థాయి మాత్రం చరిత్రలో మిగిలిపోతుందని చెప్పాల్సిందే.