Prabhas : ప్ర‌భాస్ ముందు ఖాన్ హీరోలు కూడా త‌క్కువేనా ?

Prabhas : బాహుబ‌లితో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విధ్వంసం సృష్టించిన ప్ర‌భాస్ ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మయ్యాడు. ప్ర‌స్తుతం సినిమాకి 100 కోట్లు అందుకుంటున్న ప్రభాస్.. ఇప్పుడు ఆ రేట్ ని ఓ రేంజ్ లోపెంచేశారు. నిజానికి ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేస్తే సగం బడ్జెట్.. ఈ స్టార్ హీరో రెమ్యూనరేషన్ కే స్పెండ్ చేస్తున్నారు మేకర్స్.

prabhas is the number one star in india
prabhas is the number one star in india

ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందకుంటూ ఇండియాలోనే హయ్యస్ట్ పెయిడ్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. మరి ప్రభాస్ ఒక్కో సినిమాకి ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు..ఇప్పుడు రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్‌ K, సలార్‌, స్పిరిట్‌ చిత్రాలున్నాయి. అన్నీ పాన్‌ ఇండియా సినిమాలే చేస్తున్న ప్రభాస్‌ ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

prabhas is the number one star in india
prabhas is the number one star in india

జాతీయ మీడియా కథనాల ప్రకారం డార్లింగ్‌ ‘స్పిరిట్‌’ సినిమాకు అక్షరాలా రూ.150 కోట్లు తీసుకుంటున్నాడట! స్పిరిట్‌ బడ్జెట్‌ రూ.300 కోట్లు అయితే అందులో సగం మన రెబల్‌ స్టార్‌కే ఇస్తున్నారన్నమాట! ‘అర్జున్ రెడ్డి’ ఫేం సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను ఎనిమిది భాషల్లో రూపొందిస్తుండగా బాలీవుడ్‌ నిర్మాత భూషణ్‌ కుమార్ నిర్మిస్తున్నారు.

ఇప్పటివరకు భారతదేశంలో ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఫస్ట్ హీరో ప్రభాస్ అని అంటున్నారు సినీ వర్గాలు.. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికే డార్లింగ్ సినిమా అప్డేట్స్ పై చర్చ జరుపుతున్నారు. ఖాన్ హీరోల‌కు కూడా ఇంత రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రాధకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ చిత్రాన్ని కంప్లీట్ చేసిన ప్ర‌భాస్ ఈ సినిమాని జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాడు. అలాగే.. కేజీఎఫ్ మూవీతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ చేస్తున్నాడు ప్రభాస్. ఇందులో డార్లింగ్ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. ఇక ఈ సినిమాతోపాటు.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయనున్నాడు. అలాగే సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాన్ని చేస్తున్నాడు.