Prabhas : ప్రభాస్ కు మళ్లీ అనారోగ్యం.. ట్రీట్ మెంట్ కోసం విదేశాలకు రెబల్ స్టార్..!

NQ Staff - March 15, 2023 / 11:09 AM IST

Prabhas : ప్రభాస్ కు మళ్లీ అనారోగ్యం.. ట్రీట్ మెంట్ కోసం విదేశాలకు రెబల్ స్టార్..!

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుసగా అనారోగ్యం బారిన పడుతున్నారు. చేతిలో బడా ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్న ఆయన.. సినిమా షూటింగులకు మాత్రం హాజరు కాలేకపోతున్నారు. రీసెంట్ గానే ఆయన తీవ్రమైన జ్వరంతో బాధ పడ్డారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే కోలుకున్న ఆయన సినిమా షూటింగులకు కొన్ని రోజులు వెళ్లారు.

కానీ తాజాగా మళ్లీ అనారోగ్యానికి గురైనట్టు సమాచారం. ఇలా తరచూ అనారోగ్యానికి గురి కావడంతో సినిమా షూటింగులకు చాలా అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్  విదేశాలకు వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన త్వరలోనే ఫ్లైట్ ఎక్కబోతున్నారంట.

మోకాలి ఆపరేషన్‌..?

అయితే ఆయనకు గతంలో మోకాలికి సర్జరీ అయిందని.. అందుకే ఆయన మరోసారి విదేశాలకు వెళ్తున్నారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ఆయన విదేశాలకు వెళ్తున్నారని చెబుతున్నారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు గానీ.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. సలార్, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్ కే సినిమాలతో పాటు మారుతి డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేస్తున్నారు. ఆదిపురుష్ త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఇక అన్నింటికంటే ఎక్కువగా సలార్ సినిమాపైనే భారీ అంచనాలు ఉన్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us