Prabhas: బాహుబలి కోసం 18 కోట్ల యాడ్ వదులుకున్న ప్రభాస్

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ ఆడియన్స్ కి ఈయన అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హీరో గా తన క్రేజ్ ను సంపాదించుకున్నారు. బాహుబలిలా.. ప్రభాస్ కెరీర్ కూడా ఊపందుకుంది. ఇక బాహుబలి 2 సినిమాతో దేశవ్యాప్తంగా తిరుగులేని స్టార్ హీరో గా ఎదిగారు ప్రభాస్. టాలీవుడ్ తో పాటు, బాలీవుడ్ లో కూడా ఎన్నో అవకాశాలు.. క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రభాస్ ను వరించాయి. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా సినిమా చేస్తున్నారు ప్రభాస్. అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాష్ రావత్ డైరెక్షన్ లో ఆది పురుష్ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

prabhas

ఇక ప్రభాస్ నుండి వచ్చే ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతాయి. అయితే ప్రభాస్ తో తమ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయించుకోవడానికి ఎన్నో సంస్థలు వరుస కడుతున్నారు. కానీ ప్రభాస్ మాత్రం వీటిపై అంతగా ఆసక్తి చూపించడం లేదు. తమ కంపెనీకి ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటే.. వాటికి మరింత క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారు. అలాగే బాహుబలి సినిమా రిలీజ్ తర్వాత కేవలం మహీంద్రా న్యూ లేటెస్ట్ మోడల్ కారుకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.

prabhas

దీని తర్వాత ప్రభాస్ దగ్గరకు ఎంత మంచి కంపెనీలు వచ్చినా.. వేటికి ప్రభాస్ ఓకే చెప్పలేదు. నిజానికి బాహుబలి 1 విడుదల తర్వాత ప్రభాస్ దగ్గరకు వచ్చిన ప్రాజెక్ట్స్ విలువ మొత్తం కలిపి సుమారు 18 కోట్ల రూపాయలు ఉంటుంది. అయితే తనకి డబ్బు మీద ఆసక్తి లేదనీ కేవలం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంటుంది అని ప్రభాస్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ప్రభాస్ కి ఇంట్రెస్ట్ కలిగి బ్రాండ్ అంబాసిడర్ గా మారాలనుకుంటే.. ఎంతో మంది కంపెనీ యజమానులు భారీ స్ధాయిలో ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ముందైనా ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలనుకుంటున్నారా లేదా అనేది తెలియాలి.