Akash: పూరీ త‌న‌యుడిపై ప్ర‌భాస్ పైర్‌.. డ్రామాలు దొబ్బ‌కండి అంటూ వార్నింగ్ ఇచ్చాడా..!

Akash: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చూడ్డానికి చాలా కూల్‌గా క‌నిపిస్తాడు. ఆయన ముఖంలో సీరియ‌స్‌నెస్ అనేదే క‌నిపించ‌దు. అంద‌రితో ఎంతో జోవియ‌ల్‌గా క‌నిపిస్తుంటాడు. అయితే ప్ర‌భాస్.. పూరీ త‌న‌యుడిపై ఫైర్ అయిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల‌లోకి వెళితే పూరి జ‌గ‌న్నాథ్ కొడుకు ఆకాశ్ పూరి, హీరోయిన్ కేతికా శ‌ర్మ ‘రొమాంటిక్’ సినిమా మ‌రి కొద్ది రోజుల‌లో విడుద‌ల కానుండ‌గా, ఈ సినిమా కోసం ఇంట‌ర్వ్యూ చేశారు ప్ర‌భాస్‌.

TheNewsQube-

డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌తో ఉన్న ప‌రిచ‌యం కార‌ణంగా ప్ర‌భాస్.. ఆకాశ్ కోసం గ‌ట్టిగానే కృషి చేస్తున్నాడు. మామూలుగా త‌న సినిమాల‌కే మీడియాల‌కు ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డానికి ఇబ్బంది ప‌డే ప్ర‌భాస్.. రొమాంటిక్ టీంని ఇంట‌ర్వ్యూ చేశారు. సినిమా షూటింగ్ గోవాలో జరిగింద‌ని తెలుసుకుని అక్క‌డ ఏమేం చూశారో చెప్పమ‌ని ప్ర‌భాస్ ఆకాశ్‌ను, కేతికా శ‌ర్మ‌ను అడిగితే షూటింగులో గ్యాపే లేదు అన్నారు.

ఇష్ట‌మైన ఫుడ్ గురించి అడిగిన‌ప్పుడు గోవాలో ఏ హోట‌ల్లో ఏ నాన్ వెట్ బావుంటుంద‌నే విష‌యాన్నిఆకాశ్ పూరి వివ‌రించాడు. అప్పుడు ప్ర‌భాస్.. డ్రామాలు దొబ్బ‌కండి..ఇంత‌కు ముందు అడిగితే షూటింగ్‌కే ప‌రిమితం అయ్యాం. ఖాళీయే లేదు అన్నారుగా.. ఇప్పుడేంటి ఇలా ఇన్ని చెబుతున్నారు? పిచ్చోడిలా క‌నిపిస్తున్నానా? అంటూ సీరియ‌స్ అయ్యారు. ఇది స‌ర‌దాగానే అన్నారులేండి.

రొమాంటిం చిత్రాన్ని ప్ర‌తి ఒక్క‌రు వీక్షించాల‌ని ఆయ‌న అన్నారు. సినిమా ద‌ర్శ‌కుడు అనిల్ పడూరి గురించి, సినిమాలో కీల‌క పాత్ర చేసిన ర‌మ్య‌కృష్ణ‌గారి గురించి అడిగి మ‌రీ తెలుసుకున్నారు ప్ర‌భాస్‌. ఇక యంగ్ రెబ‌ల్ స్టార్ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం స‌లార్, ఆదిపురుష్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు.

ప్ర‌భాస్ రాధేశ్యామ్ చిత్రం సంక్రాంతి కానుక‌గావిడుద‌ల కానుండ‌గా, ఈ సినిమాకు సంబంధించి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక ప్ర‌భాస్ స్పిరిట్, ప్రాజెక్ట్ కె అనే చిత్రాలు కూడా చేయ‌నున్న విష‌యం తెలిసిందే.