Hanuman Movie : హనుమాన్ టీజర్ ఎఫెక్ట్ ఆదిపురుష్ డైరెక్టర్ పై గట్టిగానే ఉందిగా.
NQ Staff - November 22, 2022 / 01:59 PM IST

Hanuman Movie : ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చింది అనే మాట ఏ ఇంటెన్షన్ తో పుట్టిందో తెలీదు గానీ.. హనుమాన్ సినిమా టీజర్ మాత్రం ఓం రౌత్ ట్రోల్సుకొచ్చింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జా హీరోగా వస్తోన్న లేటెస్ట్ ప్యాన్ ఇండియా మూవీ హనుమాన్. రీసెంటుగా రిలీజైన ఈ టీజరుకి మల్టిపుల్ లాంగ్వేజుల్లో మంచి రెస్పాన్స్ దక్కుతోంది. కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్ తో ఈ రేంజ్ విజువల్సా అంటూ షాకవుతున్నారు ఆడియెన్స్. అంతటితో ఆగకుండా ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ ని కామెంట్ చేస్తున్నారు.
వందల కోట్ల బడ్జెట్ తో, ప్రభాస్ లాంటి భారీ స్టార్లతో రామాయణం బ్యాక్ డ్రాప్ తో సినిమా అని వీడియో గేమ్స్ గ్రాఫిక్సుతో సినిమా తీస్తావా, ఓ సారి ఈ టీజర్ చూసి నేర్చుకో అంటూ ట్రోల్ చేస్తున్నారు.
టీజర్ చూశాక ఓం రౌత్ ని ప్రభాస్ ‘ఓం కమ్ టు మై రూమ్ ఎగైన్’ అని సీరియస్ గా పిలిచినట్టు మీమ్స్ వేస్తున్నారు. ‘ఇదీ టేకింగ్ అంటే, ఇవీ విజువల్స్ అంటే, ఇదీ గ్రాఫిక్స్ అంటే’ అంటూ ఫన్నీ ఎడిట్లు కూడా చేస్తున్నారు. ‘కొందరుంటారు. వందల వందల కోట్లు పెట్టి యానిమేషన్ ఫీలొచ్చే సినిమాలు తీస్తారు. మీరు సూపర్ సార్’ అంటూ ప్రశాంత్ వర్మని మెచ్చుకుంటున్నట్టు పోస్టులు కూడా వేస్తున్నారు.
ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు.. హనుమాన్ టీజరొచ్చి ఓం రౌత్ నెత్తిన పిడుగులా పడింది పాపం. ప్రశాంత్ వర్మ డెబ్యూ మూవీ “అ” తోనే డైరెక్టర్ గా తన టాలెంటును ప్రూవ్ చేసుకున్నాడు. ఆర్ట్ వర్క్, కెమెరా, విజువల్స్.. ఇలా అన్ని క్రాఫ్టులపై తనకెంత పట్టుందో చూయించి అవుట్ పుట్ తో అదరగొట్టాడు. బెస్ట్ మేకప్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో నేషనల్ అవార్డు కూడా దక్కించుకుందా చిత్రం. ఆ సినిమా తర్వాత కల్కి, జాంబీరెడ్డి చిత్రాలను డైరెక్ట్ చేసినా పెద్ద సక్సెస్ గానీ అప్లాజ్ గానీ దక్కలేదు. దాంతో హనుమంతుడి రిఫరెన్స్ తో సోషియో ఫాంటసీ జానర్లో హనుమాన్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

Prabhas Fans Trolling Om Raut By Hanuman Movie Teaser
ఇక ఆదిపురుష్, హనుమాన్ రెండూ మైథాలజీ బ్యాక్ డ్రాపే అవ్వడం, కానీ ఓం రౌత్ టేకింగ్ మాత్రం ఏ భాషలోనూ ఆడియెన్సుని అలరించకపోవడం, ఎట్ ది సేమ్ టైమ్ ప్యాన్ ఇండియాప్రాజెక్టుగా హనుమాన్ టీజర్ కి మాత్రం అన్నివైపులనుంచి ప్రశంసలు దక్కుతుండడంతో ఇప్పుడీ టాపికే సోషల్మీడియాలో వైరల్ గా మారింది.
ఈ టీజర్ చూశాక నార్త్ ఆడియెన్స్ కూడా ఎవరీ ప్రశాంత్ వర్మ? ఇంత తక్కువ బడ్జెటుతో ఈ రేంజ్ విజువల్స్ ఎలా సాధ్యం అంటూ మనోడి గురించి తెలుసుకునే పనిలో పడ్డారు. నిజానికి మైథాలజీ నేపథ్యంతో తెరకెక్కే చిత్రాలకి నార్త్ లో ఎంత మార్కెట్ ఉంటుందో, కంటెంట్ బాగుంటే కలెక్ష్స్ ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Prabhas Fans Trolling Om Raut By Hanuman Movie Teaser
రీసెంటుగా వచ్చిన కార్తికేయ టూ కాస్త లేటుగా డబ్బయినా హిందీలో ఎంతలా సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఓవైపు అలాంటి చిత్రాలు హిట్టవడం, మరోవైపు హనుమాన్ లాంటి టీజర్లు అద్భుతంగా ఉండడంతో ఓ రౌత్ కి కామెంట్స్ గట్టిగానే పడుతున్నాయి. టీజర్ కొస్తున్న రెస్పాన్స్ చూశాక మాత్రం ప్రశాంత్ వర్మ పేరు ప్యాన్ ఇండియా రేంజులో మారుమోగిపోవడం పక్కా అనుకుంటున్నారంతా.