Prabhas : ‘పఠాన్’ రిలీజ్ తర్వాత ప్రభాస్ అభిమానుల్లో చర్చ
NQ Staff - January 25, 2023 / 10:26 PM IST

Prabhas : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అంచనాలకు ఈ సినిమా ఉందా.. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది తెలియాలంటే మరో రెండు మూడు రోజులు ఆగాల్సిందే.
పఠాన్ సినిమా లోని యాక్షన్ సన్నివేశాలు చూసిన ప్రేక్షకులు అద్భుతం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ యొక్క ఎలివేషన్ సన్నివేశాలు విజువల్ వండర్ అన్నట్లుగా ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో కొన్ని బిట్స్ ను చూసిన ప్రభాస్ అభిమానుల్లో కొత్త చర్చ మొదలు అయ్యింది.
ఆ మధ్య బాలీవుడ్ లో ప్రభాస్ హీరోగా పఠాన్ చిత్ర దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ ప్రచారం జరిగింది. పఠాన్ సినిమా చూసిన తర్వాత ఆ సినిమా వెంటనే ప్రారంభం అయితే బాగుంటుంది అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు అయిన దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాహుబలి సినిమా విడుదల అయిన వెంటనే ప్రభాస్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా అప్పుడు పట్టాలెక్కలేదు. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ చేస్తున్న సినిమా తర్వాత అయినా ప్రభాస్ తో ఆయన సినిమా చేస్తాడా అనేది చూడాలి. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు.