prabhas : ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా నుంచి సరైన అప్డేట్స్ రావడం లేదని ఇప్పటికే ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. రాధేశ్యామ్ నుంచి ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూసిన ప్రతీసారి రివర్స్ లో షాక్ తగులుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర్నుంచి ఇదే తంతు జరుగుతోంది. దాంతో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిక ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఆ ఒత్తిడి వల్లే రాధేశ్యామ్ టైటిల్ తో పాటు పూజా హెగ్డే ప్రభాస్ ల ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు. కొంతవరకు ఫ్యాన్స్ కూల్ అయ్యారు. కాని రాధేశ్యామ్ కంటే తర్వాత మొదలైన సినిమాల నుంచి టీజర్స్ రిలీజవుతున్నాయి.

ఆయా హీరోల అభిమానులకి పండుగ చేసుకునే ఛాన్స్ వస్తోంది. కాని ప్రభాస్ రాధేశ్యామ్ నుంచి అలాంటి వాటికి మోక్షం కలగడం లేదు. న్యూ ఇయర్ కి వస్తుందనుకున్న టీజర్ సంక్రాంతికి అన్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టీజర్ తో రాధేశ్యామ్ టీజర్ రిలీజవుతుందని భావించారు. ఇక అటు ప్రభాస్ ఫ్యాన్స్ ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేయాలనుకున్నారు. కాని రాధేశ్యామ్ టీం డిసప్పాయింట్ చేసింది. ఫ్యాన్స్ ఎదురు చూసిన టీజర్ రానేలేదు. దాంతో మళ్ళీ ఫ్యాన్స్ హర్ట్ అయి కామెంట్స్ తో ఏకిపారేస్తున్నారు.
prabhas : సమ్మర్ అంటున్నారు కాని అది సమ్మర్ కాదు ..!
చెప్పిన సమయానికి వకీల్ సాబ్ టీజర్ వచ్చేసింది. మెగా ఫ్యాన్స్ కి కావల్సిన అంశాలున్నాయని టీజర్ లో హింట్ ఇచ్చారు. రాధేశ్యామ్ నుంచి మాత్రం ఇప్పటికీ టీజర్ విషయంలో అప్డేట్ లేదు. అయితే తాజాగా రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. రాధేశ్యామ్ సమ్మర్ కానుకగా వస్తుందని వార్తలు వచ్చాయి. అంటే ఏప్రిల్ లేదా మే లో ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజ్ ఉంటుందని భావించారు. కాని జూలై 12న ప్రభాస్ రాధేశ్యామ్‌ను రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే అది సమ్మర్ కాదు. సమ్మర్ దాటేసినట్టే. ఇదే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి కోపం రావడానికి కారణం అంటున్నారు. చూడాలి మరి అసలు రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ఎప్పుడు లాక్ చేయబోతున్నారో.