PRABHAS యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ -రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రం జూలై 30న విడుదల కానుంది. ఇక ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ చిత్రం ఏప్రిల్ 30,202న విడుదల కానుండగా, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రం ఆగస్ట్ 12,2022న రిలీజ్ కానుంది. ఈ సినిమాల పై దేశ వ్యాప్తంగా ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ చిత్రాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతుండగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందనున్న సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రాన్ని సోషియో ఫాంటసీ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు అశ్వినీదత్. ఇందులో కథానాయికగా దీపిక పదుకొణే నటిస్తుంది. ముఖ్య పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ను జులై లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం రామోజీ ఫిలిం సిటీలోనే జరగనుందట. భారీ సెట్టింగ్‌ల నడుమ విజువల్ వండర్‌గా నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా, ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయనున్నట్టు సమాచారం.
సరికొత్త సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్నఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. హాలీవుడ్ రేంజ్లో సినిమాను చిత్రీకరించేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నాన్ స్టాప్ షెడ్యూల్‌గా నాగ్ అశ్విన్ చిత్రం తెరకెక్కనుందని టాక్. వచ్చే ఏడాది చివరి వరకు సినిమాను పూర్తి చేసి 2023లో మూవీని విడుదల చేయాలని నాగ్ అశ్విన్ భావిస్తున్నాడట. సలార్, ఆదిపురుష్‌తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ షూటింగ్స్ పూర్తయ్యాక ప్రభాస్ తన బంధువల అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడని సమాచారం.