Prabhas : ప్రభాస్‌ సన్నిహితుల మధ్య గొడవలకు కారణం ఏంటి?

NQ Staff - May 30, 2023 / 08:05 AM IST

Prabhas : ప్రభాస్‌ సన్నిహితుల మధ్య గొడవలకు కారణం ఏంటి?

Prabhas : ప్రభాస్ కి అత్యంత సన్నిహితులు అయిన వంశీ, ప్రమోద్ మరియు విక్రమ్ కలిసి యువీ క్రియేషన్స్ బ్యానర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మిర్చి సినిమాతో వీరి సక్సెస్ జర్నీ మొదలయ్యింది. బాహుబలి సినిమాను కొన్ని ఏరియాల్లో విడుదల చేసిన వీరు భారీ లాభాలను దక్కించుకున్న విషయం కూడా తెల్సిందే.

ఇక యూవీ క్రియేషన్స్ లో భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న బడ్జెట్ సినిమాలను కూడా నిర్మించడం మొదలు పెట్టారు. ప్రభాస్ కి హోం బ్యానర్ అంటూ కూడా టాక్ సొంతం చేసుకోవడం జరిగింది. సాహో మరియు రాధేశ్యామ్‌ సినిమా లు ఈ బ్యానర్ నుండే వచ్చాయి.

ఇప్పుడు ఈ బ్యానర్ నుండి కొత్త సినిమాలు వచ్చే పరిస్థితి కనపడడం లేదు. ఎవరికి వారే అన్నట్లుగా కొత్త బ్యానర్స్ ని ఏర్పాటు చేసుకున్నారు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించాలని భావించారు.. అధికారికంగా కూడా ప్రకటన వచ్చింది.

కానీ ఆ సినిమా నిర్మాణం నుండి యువీ క్రియేషన్స్ తప్పుకుంది. దాంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆ సినిమా నిర్మాణంలో జాయిన్ అయింది. ప్రభాస్ సన్నిహితులు విడిపోవడం వల్లే కొత్త బ్యానర్స్ పుట్టుకొచ్చాయని.. త్వరలో యువీ క్రియేషన్స్ బ్యానర్ కనుమరుగబోతోంది అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. యూవీ నిర్మాతలు విడిపోవడానికి అసలు కారణం ఏంటి అనేది ప్రభాస్ ఏమైనా నోరు విప్పుతాడా చూడాలి.

యూవీ నిర్మాతలు వేరు పడి యూవీ కాన్సెప్ట్స్‌.. మాస్ మూవీ మేకర్స్ మరియు వి మెగా పిక్చర్స్ బ్యానర్‌ లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభాస్ అభిమానులు మాత్రం యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఉండాలని బలంగా కోరుకుంటున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us