PRABHAS: 2025 వ‌ర‌కు ప్ర‌భాస్ ఫుల్ బిజీ.. పెళ్లెప్పుడో మ‌రి..!

Priyanka - May 8, 2021 / 04:56 PM IST

PRABHAS: 2025 వ‌ర‌కు ప్ర‌భాస్ ఫుల్ బిజీ.. పెళ్లెప్పుడో మ‌రి..!

PRABHAS బాహుబ‌లి సినిమా త‌ర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రాధే శ్యామ్ చిత్ర షూటింగ్ కొంత పెండింగ్‌లో ఉండ‌గా, ఈ మూవీ క‌రోనా త‌గ్గాక థియేట‌ర్‌లో విడుద‌ల కానుంది. ఇక ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న స‌లార్, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆదిపురుష్ చిత్రాలు వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాల కోసం ప్ర‌భాస్ రేయింబ‌వ‌ళ్లు హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు.

మ‌హాన‌టి ఫేం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలోను ప్ర‌భాస్ ఓ చిత్రం చేయ‌నుండగా, ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్‌లో తెర‌కెక్కించ‌నున్నారు. 2022లో ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానున్న‌ట్టు తెలుస్తుండ‌గా, 2023లో మూవీ విడుద‌ల కానుంది. ఇక సిద్ధార్ద్ ఆనంద్ అనే బాలీవుడ్ డైరెక్ట‌ర్‌తోను ప్ర‌భాస్ ఓ చిత్రం చేయ‌నున్నాడు. ప్ర‌శాంత్ నీల్‌- దిల్ రాజు కాంబినేష‌న్‌లో ఓ చిత్రం చేసేందుకు ప్ర‌భాస్ సిద్ధంగా ఉన్నాడు. 2024లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అంటే 2024 చివ‌రి వ‌ర‌కు ప్ర‌భాస్ కాల్షీట్స్ ఫుల్ బిజీ. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల‌లో ప్ర‌భాస్ పెళ్లి అప్ప‌టి వ‌ర‌కు వాయిదా ప‌డ్డ‌ట్టేనా అని జ‌నాలు ముచ్చ‌టించుకుంటున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us