ఆర్టీఏ ఆఫీస్ కు రెబల్ స్టార్ ఎందుకు వచ్చాడు ?

Advertisement

హైదరాబాద్: ఒకప్పుడు యంగ్ రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ నిన్న సడెన్ గా ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో ప్రత్యక్షమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు ఆఫీసును చుట్టుముట్టారు. అయితే తాను కొన్న కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీస్ కు ప్రభాస్ వచ్చాడు.

ప్రభాస్ యొక్క తదుపరి చిత్రం రాధే శ్యామ్ కోసం అభిమానులతో పాటు దేశం మొత్తం ఎదురుచూస్తుంది. ఈ మూవీని జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తరువాత ప్రభాస్ వైజయంతి బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తుండగా, ఈ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నామని నిర్మాత అశ్విని దత్ తెలిపారు. టైం మిషన్ చుట్టూ ఈ కథ సాగనుందని సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here