ఎన్నారై ఫ్లైట్ అద్దెకు తీసుకున్న ప్రభాస్.. ఎక్కడికి వెళ్లాలన్నా కూడా అందులోనే..
Samsthi 2210 - November 8, 2020 / 11:49 AM IST

బాహుబలి సినిమాతో తన రేంజ్‌ని మరింత పెంచుకున్న ప్రభాస్ ఇప్పుడు కేవలం పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్నారు. త్వరలో రాధేశ్యామ్ అనే క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులని పలకరించనున్న ఆయన ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నాడు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్టు తెలుస్తుంది. అయితే కొద్ది రోజులుగా రాధే శ్యామ్ సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ రీసెంట్‌గా ముంబైలో దిగారు. ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.
కరోనా వలన ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్ర షూటింగ్ ఏడు నెలలు ఆగింది. అక్టోబర్ నుండి తిరిగి ప్రారంభించారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్‌ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. అయితే చిత్ర హీరో ప్రభాస్ కరోనా బారిన పడకుండా ఉండేందుకు స్పెషల్ ఫ్లైట్‌ని తన ఎన్ఆర్ఐ ఫ్రెండ్ దగ్గర తెచ్చుకున్నాడట. షూటింగ్స్‌కు వెళ్లాలన్నా లేదంటే స్క్రిప్ట్స్ గురించి డిస్కషన్స్ చేయడానికి ఇతర ప్రదేశాలకు వెళ్ళాలన్నా కొంత ఇబ్బంది కలుగుతుందట. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన ఫ్రెండ్ ఫ్లైట్ వాడుకుంటున్నట్టు తెలుస్తుంది.ఇటీవల ఇటలీలో షూటింగ్ చేసేందుకు ఈ ఫ్లైట్‌లోనే వెళ్లాడట. ఆది పురుష్ సినిమా గురించి చర్చిండానికి కూడా ఈ ప్రైవేట్ ఫ్లైట్‌నే తీసుకెళ్ళాడని సమాచారం.
కరోనాతో అనేక ఇబ్బందులు పడుతున్న స్టార్స్ మన పరిసర ప్రాంతాలలో షూటింగ్స్ చేయాలంటే చాలా భయపడిపోతున్నారు. కాని ప్రభాస్ కరోనా విజృంభణ కాస్త ఎక్కువగా ఉన్న ఇటలీకి వెళ్లి నెలరోజుల పాటు షూటింగ్ చేసాడంటే మాములు విషయం కాదు. ఎన్నో జాగ్రత్తల నడుమ రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ పూర్తి చేశారు. ఛాలెంజింగ్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసిన నేపథ్యంలో ఇటలీ మీడియా రాధేశ్యామ్ గురించి ప్రత్యేక కథనాలు రూపొందిస్తుంది. ప్రభాస్‌తో పాటు చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తుంది.