Adipurush : ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
NQ Staff - June 5, 2023 / 10:55 PM IST

Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన ఆదిపురుష్ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అత్యంత వైభవంగా తిరుపతిలో నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు. గత రెండు మూడు రోజులుగా వందలాది మంది ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు.
ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుక ప్లానింగ్ మొత్తంను ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ చూసుకుంటున్నాడు. ఆయన సారధ్యంలోనే ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. సెట్ నిర్మాణం మొదలుకుని కాన్సెప్ట్ వరకు అంతా కూడా ఆయనే చూసుకుంటున్నాడు అంటూ సమాచారం అందుతోంది.
ఇక ఈ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గాను భారీ ఎత్తున జనాలు హాజరు కాబోతున్నారు. ఇక భారీ ఎల్ ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేయడంతో పాటు ఎంతో వైభవంగా కార్యక్రమ హంగులు ఉన్నాయి. దాదాపుగా రెండు కోట్ల రూపాయలను ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఖర్చు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి అందులో నిజం ఎంతో కానీ భారీగా ఖర్చు చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం.