Prabhas : ప్రభాస్ ఆదిపురుష్ లో లక్ష్మణుడిగా మరో బాలీవుడ్ నటుడు..!

Prabhas : ప్రభాస్ ఆదిపురుష్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. రామాయణం ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరికి సంబంధించిన పోస్టర్స్ కూడా రిలీజయ్యాయి. అయితే ఆదిపురుష్ ప్రకటించినప్పటి నుంచి రాముడిగా నటిస్తున్న ప్రభాస్ కి జంటగా నటించే సీత పాత్రలో ఏ హీరోయిన్ నటించబోతుందన్నది సస్పెన్స్ గా ఉంది.

prabhas-adhipurush-laxman-is-a-bollywood-actor
prabhas-adhipurush-laxman-is-a-bollywood-actor

అంతేకాదు సీత పాత్ర తో పాటు లక్ష్మణుడు, భరత శత్రుజ్ఞుల పాత్రలు ఉండగా ఆ పాత్రలో నటింప చేసేందుకు ఎవరిని ఎంపిక చేసుకున్నారన్నది ఇంకా మేకర్స్ వెల్లడించలేదు. కాగా తాజా సమాచారం ప్రకారం లక్ష్మణుడి పాత్రకి బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆదిపురుష్ షూటింగ్ ముంబై లో శరవేగంగా సాగుతోంది. ఆదిపురుష్ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన రోజే భారీ సెట్ లో అగ్నిప్రమాదం జరిగింది. దాంతో ఇక ఇప్పట్లో ఆదిపురుష్ షూటింగ్ జరిగే అవకాశం లేదన్న వార్తలు వచ్చాయి.

Prabhas : ప్రభాస్ ఆదిపురుష్ లో లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ..!

కానీ మేకర్స్ అలాంటి అవాంతరాలన్నిటిని దాటుకొని సక్సస్ ఫుల్ గా షూటింగ్ జరుపుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఒకవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తూనే ముంబై వెళ్ళి ఆదిపురుష్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. కాగా ఆదిపురుష్ కోసం ఇప్పటికే లక్ష్మణుడిగా కనిపించబోతున్న సన్నీ సింగ్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడని లేటెస్ట్ అప్‌డేట్. ఇక భరత శత్రుజ్ఞుల పాత్రలకి ఎవరిని ఎంపిక చేశారన్నది తెలియాల్సి ఉంది. కాగా సీత పాత్రకి ఇప్పటికే కృతి సనన్ ఎంపిక జరిగిందని అంటున్నారు. కాని ఇంకా మేకర్స్ మాత్రం వెల్లడించలేదు.

Advertisement