Prabhas : ప్రభాస్ సలార్ లో సాలీడ్ విలన్ ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్ ..?

prabhas : ప్రభాస్ సలార్ లో నటీ నటుల ఎంపిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ కి జంటగా సలార్ లో నటించే హీరోయిన్ ఫైనల్ కాగా త్వరలో అఫీషియల్ గా ఆ హీరోయిన్ ని అనౌన్స్ చేస్తారని సమాచారం. కాగా సలార్ లో ప్రభాస్ ని ఢీకొనే విలన్ కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్ సీనియర్ నటులతో పాటు టాలీవుడ్ టాల్ హీరో రానా దగ్గుబాటి పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా తాజా సమాచారం ప్రకారం సలార్ సినిమాలో ప్రభాస్ కి ధీటుగా పోరాడే విలన్ పాత్రకి కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

prabhas-a-solid-villan-is-fixed-in-prabhas-salar-by-prashanth-neel
prabhas-a-solid-villan-is-fixed-in-prabhas-salar-by-prashanth-neel

గత కొంతకాలంగా విజయ్ సేతుపతి దేశ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పాన్ ఇండియన్ సినిమాలంటే ఖచ్చితంగా విజయ్ సేతుపతి ని మేకర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ సలార్ లో విలన్ పాత్రకి విజయ్ సేతుపతి ని తీసుకోవాలని చూస్తున్నాడట. ఇక హీరోయిన్ గా దిశాపఠాని పేరు వినిపిస్తోంది. కేజీఎఫ్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ – పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా సలార్ రూపొందనుండటం తో భారీ అంచనాలు ఏర్ప్పడ్డాయి. హోంబలే నిర్మాణ సంస్థ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

prabhas : ప్రశాంత్ నీల్ – ప్రభాస్ టార్గెట్ ఏంటీ ..?

ఇక ఈ సినిమా 4 నెలల్లో టాకీపార్ట్ కంప్లీట్ చేసేలా ప్రశాంత్ నీల్ – ప్రభాస్ టార్గెట్ పెట్టుకున్నారు. అన్నీ అనుకున్నట్టు పూర్తయితే విజయదశమి పండుగ సందర్భంగా సలార్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక సలార్ షూట్ ఫిబ్రవరి నుండి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఆదిపురుష్ 3డి.. నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు కూడా ఈ ఏడాదే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆదిపురుష్ 3డి ప్రభాస్ లేకుండా మొదలైన సంగతి తెలిసిందే. ఇక రాధే శ్యాం చిత్రీకరణ తుది దశకి చేరుకుంది. సమ్మర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement