PRABHAS: క్రేజీ లుక్‌లో క‌నిపిస్తున్న ప్ర‌భాస్.. వైర‌ల్‌గా మారిన ఫొటోస్

PRABHAS టాలీవుడ్‌లో సాలిడ్ పర్స‌నాలిటీ హీరో అంటే ఎవ‌రికైన ఠ‌క్కున గుర్తొచ్చేది ప్ర‌భాస్. ఆరడుగుల ఎత్తు, కండ‌లుతిరిగిన దేహంతో గంభీరంగా క‌నిపిస్తున్న ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమాతో అశేష ప్రేక్షాక‌ద‌ర‌ణ పొందాడు. ఈ సినిమాతో ప్ర‌భాస్ నేష‌న‌ల్ స్టార్‌గా మారాడు. ప్ర‌భాస్ న‌టించిన రాధే శ్యామ్ జూలై 30న విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం ఈ యంగ్ రెబ‌ల్ స్టార్ స‌లార్, ఆదిపురుష్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. క‌రోనా వ‌ల‌న కొద్ది రోజుల పాటు ఈ చిత్రాల‌కు బ్రేక్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది.

కరోనా త‌గ్గాక ప్ర‌భాస్ .. రాధేశ్యామ్, స‌లార్, ఆదిపురుష్ చిత్రాల‌తో పాటు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమా షూటింగ్‌లోను పాల్గొన‌నున్నాడు. అయితే ప్ర‌తి సినిమాకు త‌న లుక్‌ను మార్చుకుంటూ వ‌స్తున్న ప్ర‌భాస్ ఇప్పుడు రాధే శ్యామ్ కోసం కాస్త స్లిమ్ అయ్యాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ఆ ఫొటోల‌లో ప్ర‌భాస్‌ని చూసి ఫ్యాన్స్ ఖంగుతింటున్నారు.

Advertisement