PURI JAGANNATH: పూరీ జగన్నాథ్ త‌న గురువు అని ఒప్పుకున్న ప‌వర్ స్టార్.. షాక్‌లో సినీ ప్రియులు

తెలుగు ఇండస్ట్రీలో పూరీ జగన్నాథ్ కు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పడినా లేచే సత్తా ఉన్న దర్శకుడు ఈయన. పడ్డాడు లేచాడు కూడా. 100 కోట్ల వరకు నష్టపోయినా కూడా తిరిగి పుంజుకున్నాడు. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు పూరీ జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఈయన రేంజ్ మళ్లీ పెరిగిపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా చేస్తున్నాడు పూరీ. ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉంది. తెలుగులో పాటు తమిళం, హిందీ, మలయాళంలో విడుదల కానుంది. పాన్ ఇండియన్ స్థాయిలో లైగర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఓ స్టార్ హీరో ఇప్పుడు పూరీ జగన్నాథ్ ను తన గురువు అన్నాడు. ఆ మాట సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతుంది. అది కూడా పవర్ స్టార్ లాంటి హీరో చెప్పడం గమనార్హం.

 

ఇక్కడ పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ కాదు.. పునీత్ రాజ్‌కుమార్. యువరత్న సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చాడు ఈయన. ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం రాలేదు. పునీత్ కు ఇక్కడ మార్కెట్ లేకపోవడంతో యువరత్న ఫ్లాప్ అయింది. అయితే ఈ మధ్యే ఈ సినిమా ప్రమోషన్స్ టైమ్ లోనే పునీత్ అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పుడు మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు ఈ హీరో. ఇక్కడ చాలా మంది హీరోలు తనకు స్నేహితులు అని.. దర్శకులు కూడా రెగ్యులర్ గా కలుస్తుంటారని చెప్పుకొచ్చాడు పునీత్ రాజ్‌కుమార్. అంతేకాదు పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. తను నా గురువు అని చెప్పి షాక్ ఇచ్చాడు.

ఈయన్ని 19 ఏళ్ళ కింద ఇండస్ట్రీకి పరిచయం చేసింది పూరీనే. అప్పట్లో అప్పు సినిమాతో పునీత్ రాజ్‌కుమార్‌ను హీరోగా పరిచయం చేసాడు పూరీ జగన్నాథ్. రాజ్ కుమార్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న పూరీ.. ఆయన కొడుకును లాంఛ్ చేసాడు. అప్పు సినిమానే తెలుగులో ఇడియట్ పేరుతో రీమేక్ చేసాడు. ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయింది ఈ చిత్రం. తన కెరీర్ కు అంతటి ఓపెనింగ్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ తనకు గురువు అంటున్నాడు పునీత్. ఇప్పటికీ ఎప్పటికీ అతడే తనకు గురు అని చెప్పాడు ఈయన. ఆ తర్వాత పూరీ అందించిన కథతోనే ఆంధ్రావాలా కన్నడ వర్షన్ వీర కన్నడిగ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు పునీత్ రాజ్‌కుమార్.

Advertisement