Vijay devarakonda : AVD సినిమాస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ …!

Vijay devarakonda : ఏ ఇండస్ట్రీలోనైనా హీరోలు హీరోయిన్స్ సినిమాలు ఒక్కటే వ్యాపకంగా కాక పలు రకాలుగా బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సినిమాలు, షాపింగ్ మాల్స్ ఒపనింగ్స్ మాత్రమే కాకుండా ఏదో ఒక సైడ్ బిజినెస్లు చేసుకుంటున్నారు. కొందరు నిర్మాతలుగా మారితే, కొందరు హోటల్స్,
మల్టీప్లెక్స్ లాంటి సొంత నిర్మాణ సంస్థలను స్థాపించి ఎంత మందికో ఉపాధి కల్పిస్తున్నారు. కేవలం లాభాల కోసమే కాకుండా టాలెంట్ ఎక్కడున్నా వారికి సహకరించాలన్న ఉద్దేశ్యము లేకపోలేదు. అలాగే కొంతమంది ఆర్ఫనెజెస్ ని స్థాపించి నిరుపేదలను ఆదుకుంటున్నారు. సూర్య, సమంత, సూపర్ స్టార్
మహేష్ బాబు, రాం చరణ్, విజయ్ దేవరకొండ, కాజల్ అగర్వాల్, కళ్యాణ్ రాం ఇలా ఎంతో మంది సినిమాలే కాకుండా పలు రకాల బిజినెస్ లు విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

power-star-pawan-kalyan-in-vijay-devarakonda-avd-cinemas
power-star-pawan-kalyan-in-vijay-devarakonda-avd-cinemas

మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ అన్న బ్యానర్‌ని స్థాపించాడు. విజయ్ దేవరకొండ కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్మెంట్ అన్న బ్యానర్‌ని స్థాపించాడు. వీరు నిర్మాతలుగా మారడమే కాకుండా మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలతో కలిసి పలు సినిమాలని తెరకెక్కిస్తున్నారు. అంతే కాకుండా చిన్న బడ్జెట్ సినిమాలని స్వయంగా నిర్మింప చేయాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో మేజర్ అన్న సినిమా రూపొందిస్తున్నారు.

Vijay devarakonda : విజయ్ దేవరకొండ ఏవీడీ సినిమాస్ గ్రాండ్ ఒపెనింగ్ …!

అయితే రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్మెంట్ అన్న బ్యానర్‌ లో మీడియం బడ్జెట్ సినిమాలని నిర్మిస్తున్నాడు. ఈ బ్యానర్‌ లో ‘మీకు మాత్రమే చెప్తా’ అన్న సినిమాని నిర్మించాడు. ఇప్పుడు మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్
సినిమాస్ తో చేతులు కలిపి ఏషియన్ సినిమాస్ మూడు స్క్రీన్లతో మల్టీప్లెక్స్ ను తన స్వస్థలమైన మహబూబ్ నగర్‌లో నిర్మించారు. దానికి ఏవీడీ (ఏషియన్ విజయ్ దేవరకొండ) సినిమాస్ అని పేరు పెట్టినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అంతే కాకుండా ఈ కొత్త మల్టీప్లెక్స్ లో
మొదటి సారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ తో గ్రాండ్ గా స్టార్ట్ చేయబోతున్నారు.

 

Advertisement