Nithin : నితిన్ రంగ్ దే సినిమా ప్రీ రీలిజ్ ఈవెంట్‌కి పవర్ స్టార్..?

Nithin : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో యూత్ స్టార్ గా నితిన్ కి ఉన్న క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఆయన ఫ్యాన్స్ కూడా నితిన్ కి తోడయ్యారు. ఈ క్రేజీ హీరో నటించిన లేటెస్ట్ సినిమా ‘రంగ్ దే’. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో గత నెల ‘చెక్’ సినిమాతో వచ్చిన నితిన్ సక్సస్ అందుకోలేపోయాడు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు. గత సంవత్సరం భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకొని మంచి ఫాంలో ఉన్న వరసగా సినిమాలు లైనప్ చేసుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవాలనుకున్నాడు.

power-star-for-nithin-rang-de-pre-release-event
power-star-for-nithin-rang-de-pre-release-event

కాని ‘చెక్’ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకొని నితిన్ ఆశల మీద నీళ్ళు చల్లింది. ఇక ప్రస్తుతం నితిన్ ఆశలన్నీ త్వరలో రాబోతున్న ‘రంగ్ దే’ సినిమా మీదే పెట్టుకున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్య దేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. కంప్లీట్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే దేవీశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్ తో ‘రంగ్ దే’ సినిమా మ్యూజికల్ హిట్ నమ్మకాన్ని కలిగించాడు. ఈ క్రమంలో ‘రంగ్ దే’ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ పూర్తవడంతో నితిన్‌ కూడా ధైర్యంగా ఉన్నాడు.

Nithin : నితిన్ రంగ్ దే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్.

చెక్ సినిమా ప్రభావం రంగ్ దే మీద ఏమాత్రం పడలేదని సినిమా రిలీజ్‌కి ముందే జరిగిన మంచి బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.అయితే నితిన్ రంగ్ దే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించబోతునారు. ఇందుకి వేదిక కర్నూల్ లోని ఎస్టిబీసి కాలేజ్ ని ఎంచుకున్నారు. భారీ ఎత్తున నిర్వహించబోతున్న ఈ ఈవెంట్ కి నితిన్ ఆరాధ్య దైవం అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ హాజరవనున్నారని తెలుస్తోంది. మరి నిజంగా పవర్ స్టార్ రానున్నాడ లేదా అన్నది తెలియదు గాని అభిమానుల్లో ఉత్సాహం మాత్రం మాటల్లో చెప్పలేనంతగా పెరిగిపోయింది.

Advertisement