Posani Krishna Murali: పోసాని మాయం.. క‌ల‌వ‌ర‌ప‌డుతున్న నిర్మాత‌లు

Posani Krishna Murali: వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప‌వన్ విమ‌ర్శలు గుప్పించిన త‌ర్వాత పోసాని కృష్ణ ముర‌ళి.. పవ‌ర్ స్టార్‌పై మాట‌ల దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై బుధవారం అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి దాడి చేసిన ఘటన నేపథ్యంలో మళ్లీ రచ్చ మొదలైంది. తన ఇంటిపై జరిగిన దాడి ఘటనపై పోసాని కృష్ణ మురళి ఓ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

Posani Krishna Murali Was Missed
Posani Krishna Murali Was Missed

తనను బెదిరిస్తున్న జనసేన, పవన్ అభిమానులే తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని పోసాని కృష్ణ మురళి ఆరోపించారు ఈ వ్యవహారంలో ఇప్పటికైనా చిరంజీవి కలుగజేసుకుని పవన్ కళ్యాణ్ ను మందలించవచ్చు కదా అంటూ వ్యాఖ్యానించారు. చిరంజీవి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను కట్టడి చేసేలా ప్రయత్నించ వచ్చని పోసాని కృష్ణమురళి అభిప్రాయం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ ఎవరినైనా తిట్టొచ్చు ఏమైనా తిట్టొచ్చు కానీ ఆయనను ఎవరూ తిట్టకూడదు అంటూ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు తన భార్యకు ఏదైనా సంబంధం ఉందా ? ఆమెను అందరూ తిట్టొచ్చా ? అంటూ పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. ఫ్యామిలీ జోలికి వస్తే తానూ ఊరుకోనని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ది సైకో బుద్ధి అని పేర్కొన్నారు.

తాను రాళ్ల దెబ్బలకు భయపడిపోయేవాడిని కాదని, ఇలాంటి బెదిరింపులు చాలా చూశానని పేర్కొన్న ఆయన పవన్ కళ్యాణ్ ను తానొక్కడినే చెప్పుతో కొడతాను అంటూ మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహా అయితే పవన్ ఫ్యాన్స్ నన్ను చంపేస్తారేమో అంతకంటే ఏం చేస్తారు అంటూ వ్యాఖ్యానించారు.

ఫోన్‌లో ఆ వ్యాఖ్య‌లు మాట్లాడిన త‌ర్వాత పోసాని అదృశ్యం అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. నిర్మాత‌లు ల‌బోదిబోమంటున్నారు. ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ తర్వాత కంటాక్ట్ చేయడానికి కుదరడంలేదని పోసాని మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. కాంబినేషన్ షూటింగులకు అంతరాయం కలుగుతోందంటూ నిర్మాతలు చెబుతున్నారు.పోసాని ఎప్పుడు అందుబాటులోకి వస్తారనేది తెలయడంలేదని వాపోతున్నారు.