RANA: రానా త‌మ్ముడి సినిమాకు ముహూర్తం ఫిక్స్.. ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలుసా?

మెగాస్టార్ ఫ్యామిలీ నుండి డ‌జ‌నుకు పైగా హీరోలు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం కాగా, ఇప్పుడు ద‌గ్గుబాటి ఫ్యామిలీ హీరోలు కూడా ఒక్కొక్క‌రుగా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు రెండో త‌న‌యుడు, ద‌గ్గుబాటి రానా సోద‌రుడు అభిరామ్ టాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి కొన్నాళ్లుగా జోరుగా ప్ర‌చారం న‌డుస్తుంది. అత‌ని తొలి సినిమాని వంశీ లేదంటే తేజ‌, త‌రుణ్ భాస్క‌ర్‌, ర‌విబాబు వీరిలో ఒక‌రు తెరకెక్కిస్తార‌ని టాక్స్ వినిపించాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం ద‌గ్గుబాటి అభిరామ్ డెబ్యూ సినిమాని తేజ తెర‌కెక్కిస్తాడ‌ని టాక్. సురేష్ త‌న కుమారుడి సినిమాల‌కు సంబంధించిన బాధ్య‌త‌ల‌న్నింటిని తేజ‌కు అప్ప‌జెప్ప‌గా, కుర్రాడి కోసం మంచి స్క్రిప్ట్ రూపొందించే ప‌నిలో ఉన్నాడ‌ట తేజ‌. ఇప్ప‌టికే కుమారుడి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను సురేష్ బాబు మొద‌లు పెట్టేశాడ‌ట కూడా. అతి త్వ‌ర‌లోనే అభిరామ్- తేజ సినిమాకు సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. ఇదిలా ఉంటే తేజ రీసెంట్‌గా చిత్రం సినిమాకు సీక్వెల్‌గా ఓ ప్రాజెక్ట్ చేయ‌బోతున్న‌ట్టు అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంతో తేజ త‌న‌యుడు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కానున్నాడ‌ని టాక్.

Advertisement