Poorna: పూర్ణ..ఈ ముద్దుగుమ్మ బుల్లితెరతో పాటు వెండితెరపై ప్రేక్షకులని ఎంతఅలరించిందిగానో . అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన సీమ టపాకాయ్ సినిమాతో గుర్తింపు హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత డైరెక్టర్ రవిబాబు తెరకెక్కించిన అవును, లడ్డుబాబు, అవును 2 సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ నెటిజన్స్ ని అలరిస్తూ ఉంటుంది.


టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమై విభిన్నమైన గ్లామర్ పాత్రలతో మెప్పించిన పూర్ణ .. తాజాగా చీరకట్టులో అందాలు ఆరబోస్తూ క్యూట్ లుక్‌లో మతులు పోగొట్టింది. పూర్ణ అందచందాలకు ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. హాట్ నెస్ ఓవర్‌లోడ్ అయ్యిందని అంటున్నారు నెటిజన్లు. దీంతో ప్రస్తుతం పూర్ణ లేటెస్ట్ పిక్స్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి.

హీరోయిన్గా తెలుగు తెరపై కనువిందు చేసిన పూర్ణ `అవును` సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. బోల్డ్ రోల్స్ కి కేరాఫ్‌గా నిలుస్తుంది. పూర్ణ సినిమాల ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగా ఆమె కెరీర్ గాడి తప్పింది. కేవలం చిన్న చిత్రాలకే పరిమితమయ్యింది. ఈ నేపథ్యంలో `ఢీ` షో పూర్ణకి లైఫ్ ఇచ్చిందని, ఆమె కెరీర్‌కి బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు.

` ఢీ` షోతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంది. బుల్లితెరపై ఆమెకి సెపరేట్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. విపరీతమైన క్రేజ్ సొంతమైంది. అదే సమయంలో సినిమాల పరంగానూ ఆమెకి బిగ్ టర్న్ తీసుకునేలా చేసిందని చెప్పొచ్చు. ఇటీవల `తలైవి`, `దృశ్యం2`, `అఖండ` చిత్రాల్లో కీలక పాత్రల్లో మెరిసింది పూర్ణ. `తలైవి`లో శశికళగా మెప్పించింది. పాత్రకి ప్రాణం పోసింది.

మరోవైపు `దృశ్యం2`లో ఫస్ట్ టైమ్ లాయర్‌గా మెప్పించింది. కనిపించింది కాసేపే అయినా ఆకట్టుకుంది పూర్ణ. మరోవైపు `అఖండ` చిత్రంలో అధికారిగా అలరించింది. హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్‌కి సబార్డినేట్‌గా కీలక పాత్రలో కనిపించింది. అదే సమయంలో తన తాలుకూ బోల్డ్ రోల్ చేసింది పూర్ణ. ఇందులో రేప్‌కి గురైన సన్నివేశంలో నటించి తన డేరింగ్ స్టెప్ని చాటుకుంది.
