Poonam Khaur: ఆడ‌వాళ్ల గురించి ఆలోచించెదెవ‌రు?.. అంద‌రు అలాంటి వారేనంటున్న పూన‌మ్

Poonam Khaur: సినిమాల‌తో పెద్ద‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొంద‌క‌పోయిన కూడా సోష‌ల్ మీడియా ద్వారా మంచి ఆద‌ర‌ణ అందుకుంది. ప‌రోక్షంగా ఆమె చేసే ట్వీట్స్ ప్ర‌తి ఒక్క‌రిలో అనేక ఆలోచ‌న‌లు క‌లిగిస్తుంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రిపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తూ స‌వాల్ విసురుతూఉంటుంది పూన‌మ్.

Poonam Kaur Indirect Tweet on Pawan Kalyan
Poonam Kaur Indirect Tweet on Pawan Kalyan

ఇటీవ‌ల పోసాని ఓ ప్రెస్ మీట్‌లో పంజాబీ పిల్ల అని కామెంట్ చేయగా, అంద‌రు పూన‌మ్ కౌర్ అని అనుకున్నారు. ఈ విషయంలో పూన‌మ్ కూడా పరోక్షంగా స్పందించింది. దాసరి గారు గుర్తుకు వస్తున్నారని, ఆయన్ను మిస్ అవుతున్నాను.. ఇండస్ట్రీలో గురువు అంటే ఆయన ఒక్కరే అని పూనమ్ కౌర్ ఎమోషనల్ అయింది.

అత్యాచారం, బాధితురాలు, అంటూ కొన్ని సందేశాత్మక వీడియోలను మ‌రో పోస్ట్‌లో షేర్ చేసింది. అత్యాచారం చేసిన వాడు సిగ్గుపడాలి కానీ.. నేను ఎందుకు సిగ్గుపడాలి.. నేను ఏం తప్పు చేశాను అంటూ ఓ మహిళ ఆవేదన చెందుతున్న వీడియోను పూనమ్ కౌర్ షేర్ చేసింది. ఇక తాజాగా మరోసారి అలాంటి ఓ నర్మగర్భంగా ఉన్నటువంటి ట్వీట్ వేసింది. ఆమె ఎవరిని ఉద్దేశించి ట్వీట్ వేసిందో సరిగ్గా అర్థం కావడం లేదు.

ప్ర‌స్తుతం పూన‌మ్ కౌర్ చేసిన ట్వీట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒక్కోసారి ఓ అన్న గొప్పగా అనిపిస్తాడు.. మరి కొన్నిసార్లు ఇంకో అన్న గొప్పగా అనిపిస్తాడు.. ఈ పితృస్వామ్య వ్యవస్థలో ఎవరి ఈగోను వారు తృప్తి పరుచుకుంటున్నారే తప్పా.. ఆడవాళ్ల గురించి ఆలోచించేవారెవరున్నారు.

మీరంతా మీ ఈగోలు, అజెండాల గురించి ఆలోచించే స్వార్థపరులు. ఏ ఒక్కరూ కూడా మహిళల భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు’ అని పూనమ్ కౌర్ చేసిన పరోక్ష కామెంట్లు వైరల్ అవుతున్నాయి.