Rahul Gandhi : జోడో యాత్ర: రాహుల్ గాంధీతో పూనమ్ కౌర్.. తాతగారితో మనవరాలు.!
NQ Staff - October 29, 2022 / 10:03 PM IST

Rahul Gandhi : రాహుల్ గాంధీ అనూహ్యంగా తాతయ్య అయిపోయారు.. ఆయనకు మనవరాలిగా మారిపోయింది పూనమ్ కౌర్.! తాతగారి చెయ్యి పట్టుకుంది మనవరాలు.. అంటూ సోషల్ మీడియా వేదికగా బీజేపీ శ్రేణులు సెటైర్లు వేయడం మొదలు పెట్టడంతో, ఆ సెటైర్లకు తనదైన స్టయిల్లో ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది సినీ నటి పూనమ్ కౌర్.
పలు తెలుగు సినిమాలో నటించిన పూనమ్ కౌర్, తరచూ పవన్ కళ్యాణ్ కారణంగా వార్తల్లోకెక్కుతుంటుంది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థులు, పూనమ్ కౌర్ పేరుని తెరపైకి తెస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని విమర్శించడం మామూలే. ఈ క్రమంలో పూనమ్ కౌర్ పలు మార్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా చూశాం.
రాహుల్ జోడో యాత్రలో పూనమ్ కౌర్..
సినీ నటి అన్న విషయాన్ని పక్కన పెడితే, చేనేత కార్మికుల సమస్యల గురించి ఆమె తరచూ మాట్లాడుతుంటుంది. తాజాగా రాహుల్ జోడో యాత్రలో ఆయన్ని పూనమ్ కౌర్ కలిసింది కూడా, చేనేత సమస్యల గురించి ఆయనతో చర్చించేందుకే.
జోడో యాత్రలో పూనమ్ కౌర్ పాల్గొనగా, ఆమె చేతిని రాహుల్ గాంధీ పట్టుకున్నారు. అది తనకు భరోసా ఇచ్చినట్లు అనిపించిందనీ, ప్రధాని నరేంద్ర మోడీ ‘నారీ శక్తి’ అని మాట్లాడుతోంటే, కొందరు బీజేపీ నేతలు, కార్యకర్తలు.. మహిళల్ని అవమానిస్తున్నారని పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా మండిపడింది.
తాను ఏ పార్టీకీ చెందినదాన్ని కాదనీ.. చాలా విషయాల్లో ప్రధాని మోడీ నిర్ణయాల్ని సమర్థించానని అంటోందామె.