MLA Etela Rajender : ఈటెల‌ని క‌లిసిన పూన‌మ్… ధ‌ర్మ పోరాట‌మే ఎప్ప‌టికీ గెలుస్తుందంటూ కామెంట్

MLA Etela Rajender : ఒక‌ప్పుడు త‌న సినిమాల‌తో అల‌రించిన పూన‌మ్ కౌర్ ఇప్పుడు కామెంట్స్‌తో వార్త‌ల‌లోకి ఎక్కుతుంది. తాజాగా పూనమ్‌కౌర్‌ గురునానక్‌ జయంతి సందర్భంగా పూనమ్‌ కౌర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన కామెంట్‌, పోస్టు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హుజురాబాద్‌ బైపోల్‌ గెలిచిన ఈటల రాజేందర్‌ గెలుపు చారిత్రాత్మ కమన్న సంగతి అందరికి తెల్సిందే.

Poonam Kaur meets with MLA Etela Rajender
Poonam Kaur meets with MLA Etela Rajender

అయితే ఈ ఎన్నికలు గెలుపు, ఓటముల గురించి పూనమ్‌ స్పందించింది. ఈటల రాజేందర్‌ను స్పెషల్‌గా పూనమ్‌ కలిసింది. అంతేకాకుండా ఆయనకు శాంతి కపోతమైనా పావురాన్ని ఈటల రాజేందర్‌తో కలిసి ఎగుర వేసింది. అలా శాంతికి చిహ్నమైన తెల్లటి దుస్తుల్లో కనిపించిన పూనమ్‌ కౌర్‌ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

Poonam Kaur meets with MLA Etela Rajender
Poonam Kaur meets with MLA Etela Rajender

ఈటెల రాజేందర్‌ను ప్రత్యేకంగా కలిసిన పూనమ్ కౌర్.. గురునానక్ జయంతి సందర్భంగా ఏక్ ఓంకార్ అనే తన మతంలో పవిత్రమైన గుర్తును కానుకగా ఇచ్చింది. ధర్మ యుద్దం ఎప్పుడూ గెలుస్తుందంటూ ఈటెల రాజేందర్ విజయంపై స్పందించింది. రైతు చట్టాలు రద్దు చేయడంతో మళ్లీ స్వేచ్చ, స్వతంత్ర్యం వచ్చినట్టు అనిపించింది. శాంతికి చిహ్నమైన పావురాలను ఇలా వదిలేద్దామని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చింది.

Poonam Kaur meets with MLA Etela Rajender
Poonam Kaur meets with MLA Etela Rajender

నిబద్దత, కమిట్మెంట్, మంచివాళ్లను బాబా నానక్ ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఆయనే నా నమ్మకం, ఆయన నా చుట్టూఉన్నారని, నన్ను రక్షిస్తుంటారని నా నమ్మకమంటూ తన దైవం గురించి చెప్పుకొచ్చింది.మొత్తానికి పూనమ్ ఇలా కనిపించడంతో నెటిజన్లలో కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి. పూనమ్ కౌర్ బీజేపీలో చేరనుందా? అని కామెంట్లు పెడుతున్నారు.

పూనమ్ కౌర్..ఎస్‌వీ క‌ృష్ణా రెడ్డి దర్శకత్వంలో 2006లో వచ్చిన ‘మాయాజాలం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా తర్వాత..అడపా దడపా పలు సినిమాల్లో నటించింది. కానీ ఏ సీనిమా పెద్దగా పేరు తీసుకురాలేదు. దీంతో హీరోయిన్ పాత్రల్నీ వదిలి..హీరోలకు చెల్లెలి పాత్రల్నీ వేయడం ఆరంభించింది. అంతేకాకుండా పూనమ్ కౌర్ ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే..కన్నడ, తమిళ సినిమాలు చేసింది. ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో ఆమె సినిమాలు ఏవి పెద్దగా రావడం లేదు.