Poonam Kaur : తీవ్ర వివాదంలో ఉస్తాద్ భగత్ సింగ్… పూనమ్ కౌర్ సంచలన ట్వీట్..!
NQ Staff - May 12, 2023 / 09:08 AM IST

Poonam Kaur : హరీశ్ శంకర్ దర్శకత్వంలో దాదాపు పదేండ్ల తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి పోలీస్ కథతోనే వస్తున్నారు ఇద్దరూ కూడా. దీనికి ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరు కూడా పెట్టారు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫస్ట్ గ్లింప్స్ నేడు రిలీజ్ చేసింది మూవీ టీమ్.
ఈ ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే మూవీ టీమ్ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఇందులో కేవలం పవన్ పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇందులో ఆయన కాళ్ల కింద ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరు రాసి ఉంది. ఈ ఫొటోను పూనమ్ కౌర్ పోస్టు చేస్తూ పవన్ మీద విమర్శలు గుప్పించింది.
పవన్ నీ పాదాల కింద భగత్ సింగ్ పేరు ఉండటం ఏంటి. ఒక స్వాతంత్య్ర సమర యోధుడిని నువ్వు అవమానించినట్టే. ఈ విషయంమీద కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి. ఇది అహంకార పూరితమైన చర్య అంటూ చెప్పుకొచ్చింది పూనమ్ కౌర్. ఆమె చేసిన ట్వీట్ కు కొందరు మద్దతుగా నిలుస్తున్నారు.

Poonam Kaur Made Sensational Tweet On Poster Of Ustaad Bhagat Singh
అయితే పనవ్ ఫ్యాన్స్ మాత్రం ఆమె మీద సీరియస్ అవుతున్నారు. నీకు పవన్ కల్యాణ్ ను తిట్టడమే పని తప్ప ఇంకేం లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఆమె చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఇది ఒక రకంగా ఆలోచింపజేసే విధంగానే ఉందని చెప్పుకోవాలి. మరి దీనిపై హరీశ్ శంకర్ ఏమైనా స్పందిస్తారా లేదా చూడాలి.
When u cannot respect revolutionaries atleast don’t insult them – a recent poster release for a movie – insults the name #bhagatsingh by placing it below foot – ego or ignorance ?
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 11, 2023