రొమాంటిక్ ఫోటోల‌తో ర‌చ్చ‌.. ఇత‌నే నా ప్రియుడంటూ ప్రపంచానికి ప‌రిచ‌యం

Samsthi 2210 - October 28, 2020 / 08:02 PM IST

రొమాంటిక్ ఫోటోల‌తో ర‌చ్చ‌.. ఇత‌నే నా ప్రియుడంటూ ప్రపంచానికి ప‌రిచ‌యం

అందాల భామ ‌పూన‌మ్ బ‌జ్వా తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా సుప‌రిచితం. మొద‌టి సినిమా అనే చిత్రంతో ఆరంగేట్రం చేసిన పూన‌మ్ బ‌జ్వా .. నాగార్జున‌తో క‌లిసి బాస్ అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా నిరాశ ప‌ర‌చ‌డంతో చిన్నా చితకా సినిమాలు చేసింది. అయితే ‘వేడుక’ ‘పరుగు’ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి సినిమాల‌లో ప్ర‌త్యేక పాత్రుల పోషించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు కాస్త ద‌గ్గరైంది. పూన‌మ్ కెరీర్ గ్రాఫ్ అంత సాఫీగా లేదు. చేసిన సినిమాలు ఫ్లాప్ కావ‌డంతో ఆఫ‌ర్స్ క‌రువ‌య్యాయి. తమిళ మలయాళ కన్నడ ఇండస్ట్రీలలో త‌న అందాల‌తో ఏదో నెట్టుకొస్తుంది.

లాక్ డౌన్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్న పూన‌మ్ బ‌జ్వా అడ‌పాద‌డ‌పా వెకేష‌న్ స్టిల్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు స‌రికొత్త ఉత్సాహాన్ని క‌లిగించేది. కొద్ది రోజులుగా పూన‌మ్ బాయ్ ఫ్రెండ్‌కు సంబంధించి అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూ వ‌స్తున్నాయి. పూన‌మ్ ఓ వ్య‌క్తితో రిలేష‌న్‌లో ఉంద‌ని, త్వ‌ర‌లోనే అత‌నితో ఏడ‌డుగులు వేయ‌నుంద‌ని జోరుగా ప్రచారాలు మొద‌ల‌య్యే స‌రికి అస‌లు విష‌యం చెప్పేసింది

నేడు పూన‌మ్ బ‌జ్వా ప్రియుడు సునీల్ రెడ్డి పుట్టిన రోజు కావ‌డంతో అత‌నితో స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఫోటోల‌ను షేర్ చేస్తూ..బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలిపింది. పూన‌మ్ బ‌జ్వా షేర్ చేసిన ఫోటోల‌లో ఇద్ద‌రు చాలా చ‌నువుగా ఉండ‌డ‌మే కాదు కిస్ చేసుకుంటూ క‌నిపించ‌డంతో అభిమానులు కంగుతిన్నారు. క్రైమ్ లో, జీవితం, రొమాంటిక్ డేట్, ఆట లో ఇలా అన్నింటిలో నా భాగ‌స్వామి. నువ్వు నా క‌ల‌ల‌న్నీ బ్ర‌హ్మాండంగా ఉండేలా, అన్ని క్ష‌ణాలు మ్యాజిక్ గా చేసే క్రియేట‌ర్‌వి నువ్వు. ఆనందం, మంచి ఆరోగ్యం ,ఉత్సాహం ,ప్రేమ ,సరదా ,ఉల్లాసమైన ఈ క్షణం నుండి ప్రయాణం ఫరెవర్! ఐ లవ్ యూ!” అని పూనమ్ బజ్వా త‌న ప్రియుడికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ప్ర‌పంచానికి కూడా త‌న ప్రియుడిని ప‌రిచ‌యం చేసింది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us