Pooja hegde: మేక‌ప్ రూంలో బ‌న్నీ కూతురితో పూజా చేసిన ర‌చ్చ మాములుగా లేదు..!

Pooja hegde: మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన చిత్రం అల వైకుంఠ‌పుర‌ములో. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇందులోని పాట‌లు అయితే దేశ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ అందుకున్నాయి. అల్లు అర్జున్ కెరీర్ లో మొదటి సారి రెండు వందల కోట్ల మార్కెట్ అందుకుంది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తోనే అల్లు అర్జున్ పాన్ ఇండియా వైపు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు.

pooja hegde with arha making fun
pooja hegde with arha making fun

జులాయి, S/o సత్యమూర్తి వంటి వరుస బాక్సాఫీస్ హిట్స్ అనంతరం అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరో మంచి కమర్షియల్ సినిమా చేయాలని చాలా రోజులు చర్చలు జరిపారు. చివ‌ర‌కు అల.. వైకుంఠపురములో అనే సినిమా చేశాడు. అనుకున్నట్లే హ్యాట్రిక్ విజయాన్ని చూశారు. అల వైకుంఠపురములో సినిమా క్రియేట్ చేసిన రికార్డుల మోత ప్రపంచ వ్యాప్తంగా వినిపించింది.

పాటలు యూట్యూబ్‌లో ఖండాంతరాల వరకు వినిపించాయి. ఇక బాక్సాఫీస్ వద్ద కూడా అల వైకుంఠపురములో దుమ్ములేపేసింది. లాక్డౌన్ సమయంలో అంతా కూడా అల వైకుంఠపురములో మ్యాజిక్ నడిచింది. బుట్టబొమ్మ, రాములో రాముల పాటకు సంబంధించిన కొన్ని కోట్ల వీడియోలు, రీల్ వీడియోలు, టిక్ టాక్ వీడియోలు వచ్చాయి. అయితే అల వైకుంఠపురములో సినిమాకు తమన్ మూల స్థంభంలా నిలిచాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. నైజాంలో 43కోట్ల షేర్ రాబట్టిన అల.. వైకుంఠపురములో చిత్రం సీడెడ్ లో 19.3కోట్లను అందుకుంది. ఏపీ తెలంగాణలో టోటల్ గా 127.48కోట్ల షేర్ రాగా 210 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక‌ బుట్టబొమ్మగా పూజా చేసిన మ్యాజిక్‌కు అందరూ ‘మేడం సర్ మేడం అంతే’ అని అనేశారు.

ఈ చిత్రం విడుద‌లై రెండేళ్లు పూర్తైన సంద‌ర్భంగా పూజా హెగ్డే త‌న సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర విష‌యాలు షేర్ చేసింది. నేను అల్లు అర్జున్ కలిసి చేసిన డ్యాన్స్‌ని చూశారు కదా?.. ఇక ఇప్పుడు ఇది చూడండి.. నా షాట్ కోసం వెయిట్ చేసే ఖాళీ టైంలో అర్హతో డ్యాన్స్ చేశాను.. మాకు తెలీకుండానే బుట్టబొమ్మ స్టెప్పులను ఇద్దరం ముందే కనిపెట్టేశామేమో.. అని పూజా చెప్పుకొచ్చింది.

ఇక ట్విట్టర్‌లో పూజా హెగ్డే ఈ సినిమా స్పందిస్తూ.. ‘మనస్పూర్తిగా ఏ దురుద్దేశ్యం లేకుండా సినిమా తీస్తే.. జనాలను నవ్వించాలని, ఎంటర్టైన్ చేయాలని సినిమా తీస్తే కచ్చితంగా అద్బుతం జరుగుతుంది’ అని చెప్పుకొచ్చింది.