Pooja Hegde Took Shocking Decision : అవకాశాలు లేవని పూజా హెగ్డే షాకింగ్ డిసిషన్.. వేణు స్వామితో పూజలు..
NQ Staff - July 27, 2023 / 03:24 PM IST

Pooja Hegde Took Shocking Decision :
పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. గత నాలుగైదు ఏళ్లుగా ఈమెనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.. అయితే ఈ మధ్య ఈ అమ్మడి టైం బాలేదు.. తెలుగులో అట్టర్ ప్లాప్ సినిమాలతో ఐరెన్ లెగ్ అని పిలిపించుకున్న పూజా ఆ తర్వాత ఫుల్ ఫామ్ లోకి వచ్చి వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపొయింది..
కానీ ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు.. ఏడాది కాలంగా పూజా హెగ్డేను దురదృష్టం వెంటాడుతుంది.. కెరీర్ బిగినింగ్ లో ఎలాంటి స్ట్రగుల్స్ పడిందో మళ్ళీ ఇప్పుడు ఈమె కెరీర్ అలాంటి మలుపు తిరిగింది. వరుస ప్లాప్స్ తో కెరీర్ డీలా పడింది.. మహేష్ బాబు, త్రివిక్రమ్ గుంటూరు కారం మూవీలో ఈ భామనే ముందుగా హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.
ఈ సినిమాతో అయిన హిట్ అందుకుందాం అనుకుంటే అది కూడా చేజారి పోయింది. ఈ క్రమంలోనే ఈ భామ ఆఫర్స్ లేక మానసిక సంఘర్షణకు గురి అవుతుంది.. దీంతో షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది.. కెరీర్ లో మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకోవాలని సంచలన నిర్ణయం తీసుకుందట.. అందుకోసమే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామిని కలిసి పూజలు చేయించు కోవాలని నిర్ణయించుకుందని టాక్..
ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఈయనను కలిసి పూజలు చేయించు కోగా ఇప్పుడు ఈ భామ కూడా అదే చేయాలని అనుకుంటుందట.. తన సినీ కెరీర్ కోసం పూజా హెగ్డే వేణు స్వామితో పూజలు చేయించు కోవాలని అనుకుంటుందని సన్నిహితులు లీక్ చేసారు.. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్ అయ్యింది..