POOJA HEGDE: పూజా హెగ్డేకు క‌రోనా పాజిటివ్‌.. షాక్ లో అభిమానులు

POOJA HEGDE క‌రోనా సెకండ్ వేవ్ త‌న విశ్వ‌రూపం చూపిస్తుంది. సామాన్యుల‌నే కాదు సెల‌బ్రిటీల‌ను సైతం వ‌ణికిస్తుంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా కొంద‌రు క‌రోనా బారిన ప‌డుతున్నారు. క‌రోనా విష‌యంలో మొద‌టి నుండి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ వ‌చ్చిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా క‌రోనా వైర‌స్ బారిన ప‌డ‌డం ఆందోళ‌న రేకెత్తించింది. అయితే ఈ సారి సినీ పరిశ్రమకు చెందిన వారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. అందులోను బాలీవుడ్, టాలీవుడ్ ఇలా అందరికీ కరోనా దెబ్బ గట్టిగానే తగులుతోంది.

తాజాగా అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న పూజా హెగ్డేకు కూడా క‌రోనా పాజిటివ్ అని నిర్దార‌ణ అయింది. ఈ విష‌యాన్ని తన సోష‌ల్ మీడియాలో పేర్కొంది పూజా. హ‌లో.. నాకు క‌రోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయింద‌నే విష‌యాన్ని మీ అంద‌రికి తెలియ‌జేయాల‌ని అనుకున్నాను. కరోనా నిబంధ‌న‌లు పాటిస్తూ స్వీయ నిర్భందంలోకి వెళ్లాను. ఈ మ‌ధ్య కాలంలో న‌న్ను క‌లిసిన వారంద‌రు త‌ప్ప‌క ప‌రీక్ష‌లు చేయించుకోండి, అంద‌రు ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి అని పూజా హెగ్డే త‌న పోస్ట్‌లో పేర్కొంది.

పూజా హెగ్డేకు ఈ ఏడాది చాలా బ్యాడ్ టైం న‌డుస్తుంది. కొద్ది రోజుల క్రితం త‌ను ఎంత‌గానో ప్రేమించే బంధువు క‌న్నుమూయ‌గా, రీసెంట్‌గా తనకు చదువు చెప్పిన ఫేవరేట్ టీచర్ ఒకరు అనారోగ్యంతో కన్నుమూసార‌ని పేర్కొంది. ఆ టీచర్ జెసికా దరువాలా అని తెలియ‌జేసింది. తాజాగా ఈమెకు క‌రోనా అంటూ గుండె ప‌గిలే వార్త‌లు చెప్పుకొచ్చింది. పూజా హెగ్డే ఆచార్య‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌తో పాటు ప్ర‌భాస్ న‌టించిన ప్యాన్ ఇండియా చిత్రం రాధే శ్యామ్ షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేయ‌గా, ప్ర‌స్తుతం ఆమె ఖాతాలో త‌మిళ‌న‌టుడు విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్న 65 వ చిత్రంతో పాటు ర‌ణ్‌వీర్ సింగ్ డ్యూయ‌ల్ రోల్ పోషిస్తున్న చిత్రాలు ఉన్నాయి. క‌రోనా వ‌ల‌న ఈ చిత్రాల‌కు తాత్కాలిక బ్రేక్ ప‌డిన‌ట్టు తెలుస్తుంది.

Advertisement