pooja hegde: అభిమానుల‌తో సెల్ఫీలు.. హాట్ లుక్‌లో క్యూట్‌గా క‌నిపించిన పూజా

pooja hegde: దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో క్ష‌ణం తీరిక‌లేకుండా గ‌డుపుతున్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది పూజా. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాల్దీవ్స్‌ వెకేషన్‌ని ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. తన స్నేహితులతో కలిసి ఈ నెల 13న మాల్దీవులకు వెళ్లారు.

pooja hegde stunning look.jpg
pooja hegde stunning look.jpg

అక్క‌డ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ స‌ర‌దాగా గ‌డిపింది పూజా. స్విమ్మింగ్‌పూల్‌లో నిల్చుని ఫుడ్‌ తింటూ చుట్టూ ఉన్న సముద్రం, ప్రకృతి అందాలను ఆద్యంతం ఆస్వాదించారు. తాను ఒక సాధారణమైన అమ్మాయిలా ఓ అత్యద్భుతమైన అనుభూతి కోసం చూస్తున్నానని పూజా తెలిపారు.

అనంతరం బికినీ ఫొటోలు షేర్‌ చేసిన పూజా.. తనని తాను ఓ చాక్లెట్‌బేబీలా పోల్చుకున్నారు. ఇక, డిన్నర్‌టైమ్‌తోపాటు బీచ్‌ పరిసరాల్లో ఆమె దిగిన ఫొటోలు ఇప్పుడు యువతని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ‘‘పూజా.. సూపర్‌ డూపర్‌ గర్ల్‌’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎయిర్ పోర్ట్‌లో టూ హాట్ లుక్‌తో ప్ర‌త్య‌క్షం అయింది. అయితే కొంద‌రు అభిమానులు పూజాతో సెల్ఫీలు దిగేందుకు ఆస‌క్తి చూపారు. ఆమె ఏ మాత్రం విసుక్కోకుండా సెల్ఫీ ఇచ్చింది. ఇక ఫొటో గ్రాఫ‌ర్స్ సైతం పూజాని త‌మ కెమెరాలో బంధించారు.

పూజా క్యూట్ లుక్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీగా ఉండే హీరోయిన్లలో పూజా హెగ్డే అందరికంటే ముందుంటుంది. ఎందుకంటే గత మూడేళ్ళుగా వరస సినిమాలు చేస్తూనే ఉంది పూజా. స్టార్ హీరోలతో పాటు అప్పుడప్పుడూ చిన్న హీరోలతో కూడా నటిస్తూ తీరికలేకుండా సినిమాలు చేస్తుంది పూజా.

Actress Pooja Hegde SUPER H0T Looks | Pooja Hegde Latest Video | Daily Culture – YouTube