Pooja Hegde: బాబోయ్ జిమ్ సూట్‌లో పూజా ఇలా పిచ్చెక్కిస్తుందేంటి?

Pooja Hegde: అందాల ముద్దుగుమ్మ పూజాకి అదిరిపోయే ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ప్ప‌టికీ అందాల ఆర‌బోత మాత్రం త‌గ్గించ‌డం లేదు. విద్యాభ్యాసం పూర్తైన వెంటనే తన దృష్టిని గ్లామర్ ఫీల్డులోకి మళ్లించిన పూజా మెల్ల‌గా సినిమాల‌లోకి వ‌చ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న పలు సినీ ఇండస్ట్రీల్లో ఎంతో మంది దర్శక నిర్మాతల దృష్టిని ఆక‌ర్షిస్తున్న పూజా తొలి సారిగా ‘మూగమూడి’ అనే తమిళ చిత్రంతో పరిచయం అయింది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘ముకుంద’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా అనంతరం ‘ఒక లైలా కోసం’ అనే సినిమానూ చేసింది. ఇవి మాత్రం ఆమెకు సక్సెస్‌ను ఇవ్వలేదు. కానీ, గ్లామర్‌తో అందరినీ ఫిదా చేసేసింది. ఎప్పుడైతే ‘అరవింద సమేత.. వీరరాఘవ’తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ బుట్టబొమ్మ.. ఆ తర్వాత వరుసగా ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అల.. వైకుంఠపురములో’ వంటి విజయాలను అందుకుని స్టార్ హీరోయిన్ ఎదిగిపోయింది.

ఇప్పుడు టాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్‌ల‌లో క్రేజీ ప్రాజెక్టుల‌ని సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు రెమ్యున‌రేష‌న్ కూడా బాగా పెంచేసింది. పూజా న‌టించిన‌ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స , ‘రాధే శ్యామ్ చిత్రాలు విడుద‌ల‌కి సిద్ధంగా ఉన్నాయి. ఆచార్య చిత్ర షూటింగ్ కూడా దాదాపు పూర్తి చేసింది. హరీశ్ శంకర్ – పవన్ కల్యాణ్ కలయికలో వచ్చే సినిమాతో పాటు త్రివిక్రమ్ – మహేశ్ బాబు కాంబోలో రానున్న ప్రాజెక్టులోనూ నటిస్తోంది.

చేతి నిండా ఆఫ‌ర్స్ ఉన్న‌ప్ప‌టికీ ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది. ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ముఖ్యంగా పూజా గ్లామ‌ర్ షో చేస్తూ ఫొటో షూట్ చేయ‌గా, దానికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. పూజా త‌న ఫొటోల‌తో ఫాలోవర్స్‌ని బాగా పెంచుకుంటుంది.

తాజాగా జిమ్ డ్రెస్‌లో కొన్ని ఫోటోలు దిగింది. ఇందులో అందాల విందు చేస్తుంది. క్లీవేజ్ షో చేస్తూ తన ఎద అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. టైట్ డ్రెస్‌లో పూజాని ఇలా చూసి ఫ్యాన్స్ మ‌తులుపోతున్నాయి. ఈ ఫోటోల‌కి నెటిజ‌న్స్ నుండి భారీగా స్పంద‌న వ‌స్తుంది.