Pooja Hegde: భూమిక వార‌స‌త్వం పూజా హెగ్డే తీసుకుందా, ఏంటి?

Pooja Hegde: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో గోల్డెన్ బ్యూటీగా, హీరోల ఫ‌స్ట్ చాయిస్‌గా క‌నిపిస్తుంది పూజా హెగ్డే. మోడలింగ్ రంగంలో తన అందచందాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన పూజా హెగ్డే తొలిసారి ‘మూగమూడి’ అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘ముకుంద’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ‘ఒక లైలా కోసం’ అనే సినిమానూ చేయ‌గా, ఈ చిత్రం పెద్ద‌గా స‌క్సెస్ కాక‌పోయిన పూజా మాత్రం ఇందులోత‌న అంద చందాల‌తో ఆక‌ట్టుకుంది.


Pooja Hegde Replacing Bhoomika Place
Pooja Hegde Replacing Bhoomika Place


కెరీర్ ఆరంభంలో అప‌జయాలు పొందిన‌ప్ప‌టికీ ఇప్పుడు వ‌రుస విజ‌యాల‌తో స్టార్ హీరోయిన్ స్టేట‌స్ పొందింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీరరాఘవ’తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ బుట్టబొమ్మ.. ఆ తర్వాత వరుసగా ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అల.. వైకుంఠపురములో’ వంటి విజయాలను అందుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.


Pooja Hegde Replacing Bhoomika Place
Pooja Hegde Replacing Bhoomika Place


అయితే పూజా హెగ్డే ఇప్పుడు భూమిక వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తుంద‌నే టాక్ ఇండ‌స్ట్రీలో న‌డుస్తుంది. టాలీవుడ్ లో ముగ్గురు పెద్ద స్టార్స్ నటించిన ఏడవ సినిమాల్లో హీరోయిన్ గా నటించి వారితో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్న ఘనత కేవలం భూమిక చావ్లాకే దక్కగా, ఇప్పుడు దానిని పూజా హెగ్డే కంటిన్యూ చేయ‌నున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.


భూమిక.. సూపర్ స్టార్ మహేష్ తో ఒక్కడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఖుషి, అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సింహాద్రి సినిమాల్లో నటించి వాటితో భారీ విజయాలను సొంతం చేసుకుంది. ఈ మూడు కూడా ఆ హీరోల‌కు ఏడ‌వ సినిమాలే. ఇవి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధించాయి. ఇది భూమికి ఎప్ప‌టికీ మర్చిపోలేని అరుదైన ఘనత అని చెప్ప‌వ‌చ్చు.


ఇక ఇప్పుడు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఆయన కెరీర్ 28వ సినిమాగా త్రివిక్రమ్ తీసిన అరవింద సమేత మూవీలో క‌థానాయిక‌గా న‌టించింది పూజా. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయనున్న ఆయన కెరీర్ 28వ సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్నారు పూజా. ఈ చిత్రం కూడా మంచి స‌క్సెస్ సాధిస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు.


త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ త్వరలో తీయనున్న భారీ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా ఎంపికైనట్లు టాక్. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ 28వ సినిమా కావడం విశేషం. ఇలా ముగ్గురు టాప్ హీరోల 28వ సినిమాలో హీరోయిన్‌గా ఉన్న పూజా హెగ్డే.. భూమిక రికార్డ్ స‌మం చేస్తుందా అనేది చూడాలి.