Pooja Hegde : ఆఫర్లు లేకున్నా అక్కడ తగ్గేదే లేదు అంటున్న బుట్టబొమ్మ

NQ Staff - June 5, 2023 / 10:31 PM IST

Pooja Hegde : ఆఫర్లు లేకున్నా అక్కడ తగ్గేదే లేదు అంటున్న బుట్టబొమ్మ

Pooja Hegde : ఒక లైలా కోసం మరియు ముకుంద సినిమాల్లో హీరోయిన్‌ గా నటించిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఆ సినిమాలతో పెద్దగా గుర్తింపు దక్కించుకోలేదు. ఆ రెండు సినిమా ల తర్వాత బాలీవుడ్‌ కు వెళ్లింది. అక్కడ నుండి మళ్లీ రెండేళ్ల తర్వాత డీజే సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

అల్లు అర్జున్ తో ఆ సినిమాలో నటించడం ద్వారా ఒక్కసారిగా టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ అయ్యింది. దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు లో వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే గడచిన రెండేళ్లుగా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత పెరిగింది కానీ ఆఫర్లు మాత్రం తగ్గాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కాస్త ఆఫర్లు తగ్గినా కూడా ఈ అమ్మడి యొక్క పారితోషికం విషయంలో మాత్రం తగ్గడం లేదు. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత కారణంగా పారితోషికం భారీగా డిమాండ్‌ చేస్తోందట. దాదాపుగా రెండున్నర కోట్ల పారితోషికంను ఈమధ్య కాలంలో ఒక తెలుగు సినిమాకు డిమాండ్‌ చేసింది.

మహేష్ బాబు తో చేస్తున్న గుంటూరు కారం సినిమా కనుక సక్సెస్ అయితే ఈ అమ్మడి యొక్క పారితోషికం మూడు కోట్లు దాటినా కూడా ఆశ్చర్యం లేదు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రేంజ్ పారితోషికం టాలీవుడ్‌ లో తక్కువ మంది తీసుకుంటున్నారు. అయితే బాలీవుడ్ లో మాత్రం ఈమె పారితోషికం చాలా తక్కువ తీసుకుంటుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us