ఇలా కూడా చేస్తారా ఎవరైనా.. పూజా హెగ్డే ఎంతైనా క్రేజీ!!
NQ Staff - January 18, 2021 / 06:10 PM IST

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సోషల్ మీడియాను ఎలా వాడుతుందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాను ఎప్పుడు ఎలా వాడాలో ఎలా యూటర్న్ తిప్పాలో ఆమెకు బాగా తెలుసు. అందుకే సమంత అందంగా లేదని చెప్పి.. వెంటనే హ్యాక్ అయిందంటూ కథలు అల్లేసింది. హ్యాకర్ల మీద మండిపడ్డట్టు కలరింగ్ ఇచ్చేసింది. అలా ఆ మధ్య పూజా హెగ్డే సమంతల వ్యవహారం నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. అలా పూజా హెగ్డే సోషల్ మీడియాను బాగానే వాడుకుంటోంది.
పూజా హెగ్డే సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియోను, ఫోటోను షేర్ చేస్తూ ఉంటుంది. సినిమా షూటింగ్,సెట్‌లో అల్లరి, తన టీంతో కలిసి కేరవాన్‌లో చేసే సందడిని సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఇక లాక్డౌన్ సమయంలో అయితే పూజా చేసిన రచ్చ వేరే లెవెల్. వంటగదిలోకి దూరి కొత్త వంటకాలను ట్రై చేసింది.. ఇంట్లో కజిన్స్ చేత సపర్యలు చేయించుకుంది.. తండ్రి తాగుతూ ఉంటే పక్కనే ఉంటూ స్టఫ్ ప్రిపేర్ చేసింది. ఇలా పూజా హెగ్డే లాక్డౌన్ చేసిన సందడి రచ్చ రచ్చగా మారింది.

Pooja Hegde Pack up For Radhe shyam
పూజా హెగ్డే ప్రస్తుతం రాధే శ్యామ్ షూటింగ్‌లో ఉంది. 30 రోజుల లాంగ్ షెడ్యూల్‌కు పూజా హెగ్డే ప్యాకప్ చెప్పేసింది.ఇక హైద్రాబాద్ నుంచి తన సొంతింటికి బయల్దేరింది. ముంబైకి వెళ్తోన్నట్టు చెప్పిన పూజా హెగ్డే కేక్‌ను కట్ చేసింది. అయితే ఇది చూసి బర్త్ డే అనుకోకండి.. జస్ట్ కేక్ తినాలి అనిపించింది.. అందుకే ఇలా కట్ చేసేస్తున్నామని చెప్పుకొచ్చింది. మొత్తానికి కేక్ తినాలంటూ ఇలా కేక్ కట్ చేసి బర్త్ డే లెవెల్‌లో బిల్డప్ ఇచ్చేసింది పూజా హెగ్డే. అయితే పూజా కేక్ కట్ చేస్తుంటే మాత్రం హ్యాపీ ప్యాకప్ డే అంటూ పాట పాడేశారు.